ఆదర్శం : ప్రతిష్టాత్మక చదువును వదిలేసి చెత్త ఏరే జాబ్‌ ఎంచుకుంది... ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు

కొందరు తీసుకునే నిర్ణయాలు చిత్రంగా అనిపిస్తాయి.ప్రజలకు మంచి చేయాలి, ఈ సమాజంకు ఏదైనా మంచి చేయాలని భావించే వారు తమ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించరు.

 This 26 Year Old Girl Dropped Her Uk University Seat To Make Andaman Waste Free-TeluguStop.com

వారి జీవితంలో ఎంతో ఉన్నతమైన మంచి రోజులు ముందు ఉన్నాయని తెలిసి కూడా వాటిని పట్టించుకోకుండా వాటన్నింటిని తృణ ప్రాయంగా వదిలేసి సమాజ సేవ అంటూ ముందుకు కదిలిన వారిని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం.కొందరు సాయం చేస్తూనే తమ వ్యక్తిగత జీవితంలో కూడా రాణిస్తూ వస్తారు.

అయితే అమెరికాకు చెందిన గరీమా మాత్రం పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి స్వచ్చమైన ఐల్యాండ్‌ల కోసం తాపత్రయ పడుతోంది.

గరీమా గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆమె చినప్పటి నుండి డెవలప్‌మెంట్‌ కోర్సులో జాయిన్‌ అవ్వాలని కోరుకుంది.

ఆమె కోరిక మేరకు అమెరికాలోనే ప్రతిష్టాత్మకమైన ఒక యూనివర్శిటీలో ఆమె చదువుకు సీటు దక్కింది.అయితే ఆ యూనివర్శిటీలో జాయిన్‌ కాకుండా నీల్‌ ఐలాండ్‌ చేరింది.అక్కడున్న పరిస్థితులు చూసి చలించి పోయింది.అక్కడి స్థానికులు సముద్రపు ఒడ్డున చెత్తను వేయడంతో పాటు, వారి సరిసరాలను వారే నాశనం చేసుకుంటున్నారు.

వారికి అవగాణన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆమె స్థానికంగానే ఒక చిన్న ఉద్యోగం చూసుకుంది.

ఆదర్శం : ప్రతిష్టాత్మక చదువున

ఆ ఉద్యోగంతో వచ్చే డబ్బుతో నెల నెల స్థానికులకు అవగాహణ సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, కొంత మంది వాలీంటీర్లను ఏర్పాటు చేసుకుని బీచ్‌ అంతా కూడా శుభ్రం చేయడం జరిగింది.ఆమె కొన్ని రోజుల్లోనే 100 కేజీల చెత్తను బీచ్‌ నుండి తొలగించింది.ఆ తర్వాత దాదాపు 800 మంది వాలింటీర్లతో 200 కేజీల చెత్తను తొలగించడం జరిగింది.

గరీమా ప్రయత్నం చూసిన స్థానికులు ఆరు బయట, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం మానేశారు.చెత్తను విడివిడిగా పొడి, తడి అని వేరు చేసి వాటిని డస్ట్‌ బిన్‌ లో వేస్తున్నారు.

గరీమా పడ్డ కష్టంకు సార్ధకత దక్కింది.నీల్‌ ఐలాండ్‌ ప్రస్తుతం స్వచ్చంగా తయారైంది.

ప్రస్తుతం గరీమా దృష్టి హేవ్‌లాక్‌ ఐలాండ్‌గా చెబుతోంది.ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మన చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube