సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే అందం, అభినయం ముఖ్యమనే సంగతి తెలిసిందే.అయితే అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం వరుసగా ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలవుతున్నారు.
అలాంటి హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు.పెళ్లిచూపులు సినిమాతో రీతూవర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాకు ముందే రీతూ వర్మ బాద్ షా, ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలలో నటించారు.పెళ్లిచూపులు సినిమాతో రీతూవర్మ పేరు మారుమ్రోగినా ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఆఫర్లు అయితే రాలేదు.టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఈ బ్యూటీకి మంచి పేరును తెచ్చిపెట్టలేదు.ఈ ఏడాది రీతు వర్మ మార్క్ ఆంటోని సినిమాలో నటించారు.
మార్క్ ఆంటోని మూవీ తమిళంలో సక్సెస్ సాధించగా తెలుగులో మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.అందం, అద్భుతంగా నటించే టాలెంట్ ఉన్నా అవకాశాలు రాని క్రేజీ హీరోయిన్ గా రీతూవర్మ పేరు వినిపిస్తోంది.ఈ జాబితాలో ఉన్న మరో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు వర్ష బొల్లమ్మ పేరు వినిపిస్తోంది.యంగ్ హీరోలకు జోడీగా నటించిన వర్ష బొల్లమ్మ వరుస ఆఫర్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నారు.
హనీరోజ్, హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ), కృతిశెట్టి, పాయల్ రాజ్ పుత్ సైతం టాలెంట్ ఉన్నా మరీ ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకోవడం లేదు.టాలెంట్ ఉన్న మరి కొందరు హీరోయిన్లకు సైతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లకు సినిమా ఆఫర్లు ఇస్తారేమో చూడాల్సి ఉంది.