మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.అటువంటి వాటిలో సినిమాలలో కలిసిన నటించిన హీరో హీరోయిన్లు జీవితంలో భార్యాభర్తలు గా మారడం కూడా ఒకటి.
అయితే ఆ భార్యాభర్తలుగా మారిన తర్వాత హీరో హీరోయిన్లు మళ్లీ కలిసి నటించిన వారు చాలామంది ఉన్నారు.ఇంకొందరు విడివిడిగా నటించిన వారు కూడా ఉన్నారు.
అయితే మీకు తెలుసా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు నటించిన సినిమాలకు వారి భార్యలే దర్శకత్వం వహించారట.దానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇంతకీ ఆ హీరోలు ఎవరు?వారి భార్యలు ఏ సినిమాలకు దర్శకత్వం వహించారు అన్న వివరాల్లోకి వెళితే.జీవిత రాజశేఖర్.( Jeevita Rajasekhar ) నటి జీవిత రాజశేఖర్ అనే భర్త హీరో రాజశేఖర్ నటించిన శేషు, శేఖర్, ఎవడైతే నాకేంటి ఇలా ఎన్నో సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు.ఆమె దర్శకత్వం వహించిన పలు సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.
ఇక ప్రస్తుతం జీవిత, రాజశేఖర్ లు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.రాజశేఖర్( Rajasekhar ) చివరగా శేఖర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.అలాగే హీరో ధనుష్( Dhanush ) నటించిన త్రీ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్( Aishwarya Rajinikanth ) దర్శకత్వం వహించారు.
ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి సక్సెస్ ను సాధించిందో మనందరికీ తెలిసిందే.కానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఐశ్వర్య అన్న విషయం చాలా మందికి తెలియదు.అలాగే నటి డైరెక్టర్ విజయనిర్మల( Vijaya Nirmala ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.
ఈమె సూపర్ స్టార్ కృష్ణకు( Krishna ) భార్యగా మాత్రమే కాకుండా ఆయన నటించిన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది.అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది విజయనిర్మల.