అమెరికా : ముగిసిన హెచ్ 1 బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ.. మరి మిగిలిన వాటి పరిస్ధితేంటీ..?

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసాల( H1B visa ) కోసం నిర్దేశిత పరిమితికి తగ్గ దరఖాస్తులు అందాయని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)( USCIS ) ప్రకటించింది.హెచ్ 1 బీ వీసాలు మంజూరుకానీ వారికి మరికొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తామని వెల్లడించింది.

 Us Hits H1b Visa Limit For 2024, Here's What's Next For Businesses And Foreign W-TeluguStop.com

ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.యూఎస్ కాంగ్రెస్ హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.

ఇందులో 6800 వీసాలు యూఎస్ – చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.

అయితే కామన్‌వెల్త్ ఆఫ్ నార్తర్న్ మరియానా ఐలాండ్స్ (సీఎన్ఎంఐ), గ్వామ్‌‌లోని హెచ్ 1 బీ కార్మికులు 2008 నుంచి డిసెంబర్ 2029 వరకు కన్సాలిడేటెడ్ నేచురల్ రిసోర్సెస్ యాక్ట్ ద్వారా సెట్ చేయబడిన మార్గదర్శాలను అనుసరించి క్యాప్‌ నుంచి మినహాయించవచ్చు.

Telugu Chile, Foreign, Hb Visa, Julie Stufft, Singapore, Stem, Visa, Uscis, Visa

నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ ( STEM ) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Telugu Chile, Foreign, Hb Visa, Julie Stufft, Singapore, Stem, Visa, Uscis, Visa

ఇకపోతే.హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్ 1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.ఈ మేరకు వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ స్టఫ్( Julie Stufft ) వెల్లడించారు.

దీని ప్రకారం తొలుత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నారు.మూడు నెలల పాటు ఈ పైలట్ ప్రోగ్రామ్ అందుబాటులో వుంటుందని జూలీ తెలిపారు.భారతీయుల నుంచే అమెరికా వీసాలకు ఎక్కువ డిమాండ్ వుందని.అందువల్ల వారికి వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని జూలీ స్టఫ్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube