ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తున్న స్మార్ట్ గ్లాసెస్ ఇవే!

నేడు ప్రపంచమే స్మార్ట్ యుగం అయిపోయింది.సాంకేతికత రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అనేక ఆవిష్కరణలు మతిపోగొడుతున్నాయి.

 These Are The Smart Glasses That Are Introducing The World ,redmi, Smart Glasse-TeluguStop.com

ఇపుడు వర్చువల్ ప్రపంచం అనేది మరింత వాస్తవికంగా తయారవుతోంది.తాజాగా బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో షియోమీ తన కొత్త ప్రోటోటైప్ వైర్‌లెస్ ఏఆర్ గ్లాసెస్ డిస్కవరీ ఎడిషన్‌ను ఆవిష్కరించింది.

దీని బరువు 126 గ్రాములు కాగా ఇది “రెటీనా-స్థాయి” డిస్‌ప్లేతో మార్కెట్లోకి రావడం కొసమెరుపు.షియోమీ విజువల్ కోసం 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, ఫ్రీ-ఫారమ్ లైట్-గైడింగ్ ప్రిజమ్‌లతో ఒక జత మైక్రో ఎల్‌ఇడి స్క్రీన్‌లను లెన్స్ కోసం తయారుచేసింది.

వివిధ లైటింగ్ పరిస్థితులలో వ్యూ సర్దుబాటు చేయడానికి ఎలక్ట్రోక్రోమిక్ లెన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు షియోమీ తెలిపింది.ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఏఆర్ గ్లాసెస్ ని మీ ఫోన్‌కి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఐతే ఇది షియోమీ 13 సిరీస్ ఫోన్ లేదా వన్ ప్లస్ 11 వంటి ఏదైనా ఇతర స్నాప్‌డ్రాగన్ స్పేస్-రెడీ ఫోన్ అయి ఉండాలి.షియోమీ కొత్త అధునాతన ఏఆర్ పరికరం స్నాప్ డ్రాగన్ స్పేసేస్ XR డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ మద్దతుతో వస్తోంది.

ఇది క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ XR 2 Gen 1 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.

ఏఆర్ గ్లాసెస్‌ వలన ఉపయోగం ఏమంటే, వీక్షకులు టిక్ టాక్, యూట్యూబ్ వంటి యాప్‌లలో కంటెంట్‌ను చూడగలరు.అంతేకాకుండా ఏఐ టెక్నాలజీతో వాయిస్ కమాండ్ ద్వారా మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులను చాలా తేలికగా కంట్రోల్ చేయవచ్చు.ఇంకా ఈ పరికరంతో మీరు స్మార్ట్ ల్యాంప్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

కాగా ఈ విషయాలన్నీ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.అయితే వర్చువల్ ప్రపంచాన్ని ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ఈ అద్దాలు ఎంత మంచివో ఇప్పుడే చెప్పడం కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube