యావత్ దేశంలోనే పెను దుమారాన్ని సృష్టించిన వివాదాస్పద యాడ్స్ ఇవే!

ఏ దేశంలోనైనా సినిమా తారలు, క్రీడాకారులకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందిరికీ తెలిసిందే.మనదేశంలో ఐతే ఈ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి.

 These Are The Controversial Ads That Created A Lot Of Noise In The Whole Country-TeluguStop.com

ఇలా వారు ఏం చేసినా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.అందుకే చాలా సంస్థలు తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వారిని నియమించుకొని వారికీ కోటానుకోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ ఇస్తూ వుంటారు.

ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సినిమా వాళ్లతో యాడ్స్ చేయించుకుంటే, మరికొన్ని కంపెనీలు క్రీడా ప్రముఖులతో యాడ్స్ చేయించుకుంటాయి.

అయితే, ఈ క్రమంలో కొన్ని యాడ్స్.అందులో నటించిన స్టార్స్ కు తలనొప్పులు తెచ్చిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి.వాటిలో ముఖ్యమైన ఇక్కడ చూద్దాం.

అందులో మొదటిది ఐశ్వర్య రాయ్ – కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్( Aishwarya Rai – Kalyan Jewelers Add ).ఈ యాడ్ లో ఐశ్వర్య వెనుక ఓ ఓ నలుపు రంగు అమ్మాయి గొడుగు పట్టుకుని ఉంటుంది.దాంతో ఆ యాడ్ జాత్యంహకారాన్ని పోత్సహించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.ఆ తరువాతది అమితాబ్ బచ్చన్ – పెప్సీ యాడ్( Amitabh Bachchan – Pepsi Ad ).జైపూర్లోని ఓ పాఠశాల విద్యార్థిని.“మా టీచర్లు పెప్సీ ఒక విషం అని చెబుతుంటే మీరు ఆ ప్రకటనలో ఎందుకు నటిస్తున్నారు?” అని ప్రశ్నించడంతో అమితాబ్ ఆ బ్రాండ్ కు ప్రచారం చేయడం మానేశారు.

ఈ లిస్టులో మూడవది MS ధోనీ & హర్భజన్ సింగ్ – లిక్కర్ యాడ్.హర్బజన్ నటించిన లిక్కర్ యాడ్ కౌంటర్ గా పోటీ సంస్థ ధోనీతో మరో యాడ్ చేసింది.అయితే, ఆ కౌంటర్ హర్బజన్ తండ్రిని కించపరిచేలా, సిక్కు సమాజాన్ని అగౌరవ పరిచేలా ఉందనే కారణంతో వివాదం నెలకొనగా ఆ ప్రకటనను అనతికాలంలోనే నిలిపేశారు.ఇక ఈ లిస్టులో వరుసగా అనేక కారణాలతో అమితాబ్ బచ్చన్ – కచ్చా మాంగో యాడ్, అలియా భట్ – మాన్యవర్ యాడ్, అక్షయ్ కుమార్ – ఫ్యాషన్ షో ప్రమోషన్, రష్మిక మందన్న & విక్కీ కౌశల్– లోదుస్తుల ప్రకటన, అల్లు అర్జున్ – ర్యాపిడో యాడ్ వరుసగా నిలుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube