యావత్ దేశంలోనే పెను దుమారాన్ని సృష్టించిన వివాదాస్పద యాడ్స్ ఇవే!

ఏ దేశంలోనైనా సినిమా తారలు, క్రీడాకారులకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందిరికీ తెలిసిందే.

మనదేశంలో ఐతే ఈ ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి.ఇలా వారు ఏం చేసినా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

అందుకే చాలా సంస్థలు తమ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వారిని నియమించుకొని వారికీ కోటానుకోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ ఇస్తూ వుంటారు.

ఈ క్రమంలో కొన్ని కంపెనీలు సినిమా వాళ్లతో యాడ్స్ చేయించుకుంటే, మరికొన్ని కంపెనీలు క్రీడా ప్రముఖులతో యాడ్స్ చేయించుకుంటాయి.

"""/" / అయితే, ఈ క్రమంలో కొన్ని యాడ్స్.అందులో నటించిన స్టార్స్ కు తలనొప్పులు తెచ్చిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి.

వాటిలో ముఖ్యమైన ఇక్కడ చూద్దాం.అందులో మొదటిది ఐశ్వర్య రాయ్ - కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్( Aishwarya Rai - Kalyan Jewelers Add ).

ఈ యాడ్ లో ఐశ్వర్య వెనుక ఓ ఓ నలుపు రంగు అమ్మాయి గొడుగు పట్టుకుని ఉంటుంది.

దాంతో ఆ యాడ్ జాత్యంహకారాన్ని పోత్సహించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.ఆ తరువాతది అమితాబ్ బచ్చన్ – పెప్సీ యాడ్( Amitabh Bachchan – Pepsi Ad ).

జైపూర్లోని ఓ పాఠశాల విద్యార్థిని.“మా టీచర్లు పెప్సీ ఒక విషం అని చెబుతుంటే మీరు ఆ ప్రకటనలో ఎందుకు నటిస్తున్నారు?” అని ప్రశ్నించడంతో అమితాబ్ ఆ బ్రాండ్ కు ప్రచారం చేయడం మానేశారు.

"""/" / ఈ లిస్టులో మూడవది MS ధోనీ & హర్భజన్ సింగ్ – లిక్కర్ యాడ్.

హర్బజన్ నటించిన లిక్కర్ యాడ్ కౌంటర్ గా పోటీ సంస్థ ధోనీతో మరో యాడ్ చేసింది.

అయితే, ఆ కౌంటర్ హర్బజన్ తండ్రిని కించపరిచేలా, సిక్కు సమాజాన్ని అగౌరవ పరిచేలా ఉందనే కారణంతో వివాదం నెలకొనగా ఆ ప్రకటనను అనతికాలంలోనే నిలిపేశారు.

ఇక ఈ లిస్టులో వరుసగా అనేక కారణాలతో అమితాబ్ బచ్చన్ – కచ్చా మాంగో యాడ్, అలియా భట్ - మాన్యవర్ యాడ్, అక్షయ్ కుమార్ – ఫ్యాషన్ షో ప్రమోషన్, రష్మిక మందన్న & విక్కీ కౌశల్– లోదుస్తుల ప్రకటన, అల్లు అర్జున్ – ర్యాపిడో యాడ్ వరుసగా నిలుస్తాయి.

ఈ న్యాచుర‌ల్ ఫేస్ వాష్‌ను వాడితే మొటిమలు, మచ్చలు లేని చర్మం మీసొంతం!