టీడీపీ యువనేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ లో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని నియోజకవర్గం లో ఆసుపత్రిలో సదుపాయాలు సరిగ్గా లేవని.దీంతో గర్భిణీ మరణించినట్లు సంచలన పోస్ట్ పెట్టారు.“సైకో జగన్ విధ్వంస పాలనలో మరో విషాదం.ప్రచారానికి వేలకోట్లు తగలేస్తూ, జగనన్న సురక్ష అని డబ్బా కొట్టుకుంటూ…ఆస్పత్రిలో కనీస వైద్యసదుపాయాలు కల్పించని దుస్థితి.ఆస్పత్రికి చేరేందుకు వెళ్లే రోడ్లు గుంతలమయమై ప్రాణాలు తీసిన దారుణం.
చిలకలూరిపేట ఎమ్మెల్యే వైద్యారోగ్య శాఖా మంత్రి విడదల రజనీ సొంత జిల్లాలో జరిగిన ఘోరం.
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన బత్తిన ఆనంద్ తన భార్య రామాంజమ్మకి పురిటినొప్పులు రావడంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళితే, సౌకర్యాలు లేవని వైద్యులు చెప్పగా గురజాల ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యులూ వైద్యం చేయలేమని చెప్పడంతో నరసరావుపేట తరలించారు.బైక్పై ఇంటికెళ్లి వైద్య ఖర్చులకు డబ్బులు తెస్తూ జూలకల్లు వద్ద రోడ్డు గుంతల్లో పడి ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు.
భార్యని ప్రసవానికి చేర్చిన నరసరావుపేట ఆస్పత్రిలోనే ప్రాణాలు వదిలాడు.ఆనంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు, జగనాసురుడి విధ్వంస పాలన బలి తీసుకుంది.ఇది సర్కారీ హత్య” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.