సోమవారం ట్విట్టర్ వేదికగా చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మిడ్ పీల్డర్ జకుబ్ జాంట్కో చెప్పిన సంచలన విషయం వైరల్ గా మారింది.తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటిస్తూ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
కొంతమంది ఆటగాళ్లు మాత్రమే తాము స్వలింగ సంపర్కులమని ధైర్యంగా బయటపెట్టేశారు.తాను కూడా ఆ జాబితాలో చేరిపోయానంటూ, ఇక ఈ విషయం దాచవలసిన అవసరం లేదని తెలిపాడు.తాను కూడా అందరితో పాటు స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటున్నట్లు తెలుపుతూ, ఫుట్ బాల్ కెరీర్లో ఇంకా బెస్ట్ కావడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.తనను తాను స్వలింగ సంపర్కుడినని స్వేచ్ఛగా ప్రకటించుకుంటూ, ఎవరికి తాను భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు.
తన పర్సనల్ లైఫ్ తనకు నచ్చినట్లుగా ఉంటానని ట్విట్టర్ వేదికగా తన మనసులోని మాట బయట పెట్టేశాడు.
ఇక 1990లో జస్టిన్ ఫషాను తనను తాను గెగా ప్రకటించుకుంటే, 2021 లో ఆస్ట్రేలియా కు చెందిన జోష్ కావల్లో, 2022 లో ఇంగ్లీష్ ఫుట్ బాలర్ జేక్ డేనియల్స్ గేగా ప్రకటించుకుంటే, తాజాగా మిడ్ పీల్డర్ జకుబ్ జాంట్కో తనను తాను గేగా ప్రకటించుకుని వీరి జాబితాలో చేరాడు.ఇక ఫుట్ బాల్ విషయానికి వస్తే చెక్ రిపబ్లిక్ తరఫున 45 మ్యాచ్ లు ఆడి నాలుగు గోల్స్ కొట్టాడు.అంతేకాకుండా సీరీ- ఎ క్లబ్ లో ఉడినీస్, సంప్డోరియా క్లబ్ లకు ప్రాతినిథ్యం వహించాడు.
కానీ జకుబ్ జాంట్కో బయటపెట్టిన ఈ సంచన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ధైర్యంగా అసలు విషయం బయట పెట్టడంతో కొంతమంది హర్షం వ్యక్తం చేయడం కూడా గమనార్హం.