రోడ్డుపై వెళ్తున్న దున్నపోతును టచ్ చేసిన వ్యక్తి.. తర్వాతేం జరిగిందో చూస్తే..

కొంతమంది ప్రజలు దారిని పోయే కంపను కాలికి తగిలించుకుంటారు.ఆ తర్వాత నానా ఇబ్బందులు పడుతూ ఈ పని ఎందుకు చేసాం రా బాబు అంటూ తలబాదుకుంటారు.

 The Person Who Touched The Plow On The Road What Happened Next, Viral Video, Lat-TeluguStop.com

ఒకసారి షాక్ తగిలితే గాని వారికి బుద్ధి రాదని కూడా చెప్పవచ్చు.ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అడపాదడపా వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఈ తరహా వీడియో మరొకటి వైరల్ గా మారింది. “ఇంటర్నెట్ ఆల్ ఆఫ్ ఫేమ్” ( Internet All of Fame )ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే మూడు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఎద్దులు కొన్ని గదుల పక్కన వరుసగా నడుస్తూ వెళ్లడం మనం చూడవచ్చు.అయితే ఒక రూమ్ లో ఉన్న వ్యక్తి తన పక్కనుంచే వెళ్తున్న ఒక ఎద్దును టచ్ చేసాడు.నిజానికి అతడు దాని కొమ్ము పట్టుకొని లాగాడు.

దాంతో ఎద్దుకి చాలా కోపం వచ్చేసింది. “ఎవర్రా నువ్వు నీ సంగతి చూస్తానన్నట్లు” అది ఆ గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది.

వెనక కాళ్లపై పైకి లేచి సదరు వ్యక్తిని పొడవడానికి ట్రై చేసింది.అప్పుడు ఆ వ్యక్తి దాని కొమ్ములు పట్టుకొని వెనక్కి నెట్టడానికి ట్రై చేశాడు.

కానీ అది తగ్గలేదు ఈ పెనుగులాటలో రూమ్ డోర్ ఊడిపోయింది.

ఇంకేముంది ఆ గదిలో ఉన్నవారు వెనుక మార్గం నుంచి పారిపోవడానికి ఉరుకులు పరుగులు తీశారు.మిగతావారు ఈ ఎద్దును ఆపడానికి ట్రై చేశారు కానీ అది కుదరలేదు.ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా అనేది తెలియ రాలేదు.

ఈ దున్నపోతు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉంది.అందుకే అది అంతగా దాడి చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube