తెలంగాణ కాంగ్రెస్ చేవెళ్లలో తలపెట్టిన సభ మరోసారి వాయిదా పడింది.ఈనెల 24వ తేదీన సభ జరగాల్సి ఉండగా ఈనెల 26 టీపీసీసీ వాయిదా వేసిందని తెలుస్తోంది.
ఈనెల 24న ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాజస్థాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు టీ -పీసీసీ ప్రకటించింది.అయితే చేవెళ్ల కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన ఈ సభ వాయిదా పడటం ఇది రెండోసారి.
మొదటగా 18వ తేదీన సభను నిర్వహించాలని భావించిన టీపీసీసీ అనివార్య కారణాలతో 24కు వాయిదా వేసింది.తాజాగా ఖర్గే పర్యటనతో 26వ తేదీకి వాయిదా వేసింది.
కాగా కాంగ్రెస్ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొని ఎస్సీ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.