నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు 15వ గేటును అధికారులు అతికష్టం మీద ఎత్తారని తెలుస్తోంది.గేట్ లో ఉన్న చెత్తను క్లియర్ చేసి జేసీబీ సాయంతో గేటును ఎత్తారు.
దీంతో ప్రస్తుతం కడెం ప్రాజెక్టు 15 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.కాగా ప్రాజెక్టు మరో మూడు గేట్లు మొరాయిస్తున్నాయని అధికారులు తెలిపారు.కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1.80 లక్షల క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2.58 లక్షల క్యూసెక్కులుగా ఉంది.