తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఆ క్రెడిట్ ను తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విఫలమైన పరిస్థితి ఉంది.
అయితే ఆ విఫలం తరువాత త్వరగా తేరుకొని ప్రజల సమస్యలపై బలంగా పోరాడితే చాలా వరకు కాంగ్రెస్ పట్ల సానుభూతి అనేది ప్రజల్లో ఉండే పరిస్థితి ఉండేది.కానీ ఆ దిశగా దృష్టి సారించకుండా అంతర్గత పోరుతో పార్టీ ప్రతిష్ట ప్రజల్లో పెద్ద ఎత్తున దిగజారిన పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుత పరిస్థితిల్లో రేవంత్ రెడ్డిపైనే పూర్తి భారం ఉన్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద ఎత్తున ఆశలు, నమ్మకం పెట్టుకున్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా అంతేకాక బీజేపీ బలం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి.అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ కు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్న పరిస్థితి ఉంది.
అయితే నాయకులలో సఖ్యత లేకపోవడం,వ్యక్తిగత పట్టింపుల కొరకు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఇప్పటికీ ఆ గ్యాప్ ఉంది కావున బీజేపీ వైపు ప్రజలు కొద్దో, గొప్పో చూస్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ రెడ్డి ఎంతో కొంత ప్రయత్నిస్తున్నా పెద్దగా కాంగ్రెస్ సీనియర్ ల నుండి మద్దతు రానటువంటి పరిస్థితి ఉంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో కూడా హుజూరాబాద్ తరహా ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఇప్పటికైనా పార్టీ బలపడటం కోసం నేతలందరూ కలిసివస్తారా లేక ఇదే తరహా విధానాన్ని కొనసాగిస్తారా, లేక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ఒక్కటిగా పోరాడతారా అనేది చూడాల్సి ఉంది.