త‌న ట్యాలెంట్‌ను వీడియో ద్వారా తెల‌పాల‌నుకున్న మ‌హిళా పోలీస్‌.. కానీ..

ప్ర‌స్తుతం అంతా కూడా సోస‌ల్ మీడియాదే హ‌వా కొన‌సాగుతోంది.దీంతో అంద‌రూ కూడా ఏదో ఒక విధంగా వీడియో తీసి త‌మ ట్యాలెంట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా నిరూపించుకోవాల‌ని భావిస్తున్నారు.

 The Female Police Officer Who Wanted To Show Her Talent Through Video But , Fema-TeluguStop.com

ఈ కార‌ణంగానే చాలా మంది ఏదో ఒక ప్ర‌య‌త్నం చేసి స్టార్లు అయిపోతున్నారు.ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఈజీగానే పాపులారిటీని సంపాదించుకోవ‌డంలో భాగంగా ఈ మ‌ధ్య ప్ర‌భుత్వ జాబులు చేస్తున్న వారు కూడా ఇలాగే ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ప్ర‌భుత్వ ఆఫీస‌ర్లు ఇలాంటి వీడియోలు తీసే క్ర‌మంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఏ మాత్రం పొర‌పాటు జ‌రిగినా చివ‌ర‌కు ఉద్యోగానికి ఎస‌లు వ‌స్తుంది.

ఇప్పుడు కూడా ఇలాగే ఓ మహిళా కానిస్టేబుల్ త‌న ట్యాలెంట్ ఏంటో నిరూపించుకోవాల‌ని అనుకుంది.కాగా ఈ క్ర‌మంలోనే ఆమె సరదాగా ఓ వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌టంతో అది కాస్తా ఈజీగానే వైరల్ అయిపోయింది.

ఇంకేముంది ఆమె కాస్తా వివాదంలోకి కూరుకుపోయారు.ఇప్పుడు ఆమె చేసిన వీడియో కాస్తా ఉన్నతాధికారుల దాకా వెళ్ల‌డంతో వారు చూసి ఆమెపై విచార‌ణ చేసి చర్యలకు ఆదేశించారు.

ఇక్క‌డే ఆమె చేసిన పెద్ద తప్పేంటి అని తెలుసుకోవాల‌ని ఉందా.

Telugu Female, Female Show-Latest News - Telugu

అయితే ఈమె పేరు ప్రియాంక మిశ్రా, ఈమె ఆగ్రాలోని ఓ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వ‌హిస్తోంది.కాగా ఆమె డ్యూటీలో ఉండ‌గానే ఖాకీ డ్రెస్ లో పైగా త‌న డ్యూటీ తుపాకీని చేతిలో ప‌ట్టి మ‌రీ ఒక డైలాగు చెప్పి దానికి త‌గ్గ‌ట్టుగా లిప్ సింక్ చేయ‌డంతో అది కాస్తా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.అయితే ఆమె చెప్పిన డైలాగులో నేరాలకు అడ్డాగా హర్యానా పంజాబ్ లఉన్నాయ‌ని, అయితే త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే ఐదేళ్ల పిల్లలకు కూడా తుఫాకీలు వాడటం తెలుసంటూ చెప్ప‌డం ఇక్క‌డ పెద్ద దుమారం రేపుతోంది.

బాధ్యత కలిగిన పోలీసు ఇలా చేస్తారా అంటూ చ‌ర్య‌లకు ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube