యజమాని లేకపోయినా చేపను పట్టేసిన కుక్క.. వీడియో వైరల్...

కుక్కలు( Dogs ) చాలా తెలివైనవి.అవి వాటి తెలివిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ మనుషులను ఆశ్చర్యపరుస్తుంటాయి.

 The Dog Caught The Fish Even Without Its Owner Video Viral, Viral Video, Latest-TeluguStop.com

తెలివైన కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి అందరు ఆకట్టుకుంటాయి.తాజాగా మరొక స్మార్ట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక కొలను ఒడ్డున ఒక వ్యక్తి తన కుక్కతో కలిసి చేపలు( Fish ) పట్టడం మనం చూడవచ్చు.కొద్దిసేపటికి అతడు వాష్ రూమ్ కి వెళ్ళాడు.సరిగ్గా అదే సమయంలో అతడు నీటిలో ఉంచిన ఫిషింగ్ పోల్ ఎరకు ఒక చేప చిక్కింది.అప్పుడు పోల్‌ కదలడం ప్రారంభించింది.అది చూసి కుక్క వెంటనే అలర్ట్ అయింది.తన యజమానికి ఈ విషయం చెప్పడానికి వాష్ రూమ్ వద్దకు వెళ్లి డోర్ పై తన కాళ్ళతో కొట్టింది.

అతడు ఎంతకీ రాకపోవడంతో కుక్క ఆ చేప ఎరను వదిలించుకొని పారిపోతుందేమో అని భావించింది.ఇక లాభం లేదు అని తానే ఆ చేపను బయటకు తీయాలని నిర్ణయించుకుంది.

అనంతరం ఫిషింగ్ పోల్‌ను తన నోటితో పట్టుకొని లాగుతూ వెనక్కి వెళ్ళింది.అలా చేపను బయటకు తీసుకు వచ్చింది. చేప బయటపడిందో లేదో నిర్ధారించుకొని ఆ తర్వాత అది చేపను చూసి అలా చూస్తుండి పోయింది.ఇంతలోనే యజమాని భాష్యం వెలుపలికి వచ్చికుక్క చేపను బయటకు తీసుకురావడానికి చూసి ఆశ్చర్యపోయాడు.

అనంతరం చేపను వెనక్కి లాక్కొచ్చాడు.ఆపై దానిని తీసుకున్నాడు దాంతో వీడియో ముగిసింది.

ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ఈ కుక్క చాలా స్మార్ట్ అని పేర్కొంటున్నారు.

ఈ శునకం చేపలు పట్టడం బాగా అర్థం చేసుకుందని మరికొందరు అన్నారు.@Buitengebieden ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 65 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి ఒక నిమిషం పాటు నిడివి గల ఈ వీడియోను చాలామంది చూసి వావ్ అంటున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube