తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ మేరకు గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గత సంవత్సరం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నామని చెప్పారు.దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదన్నారు.
కానీ అన్నీ ఉండికూడా ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.ఈ క్రమంలో వనరులను వినియోగించుకొని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని తెలిపారు.
సమైక్య పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్న కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని స్పష్టం చేశారు.విధ్వంసమైన తెలంగాణను విజయవంతంగా ముందుకు నడిపామని వెల్లడించారు.