హైదరాబాద్ లో అరెస్ట్ అయిన పాకిస్తానీపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.పాకిస్తానీ ఫయాజ్ భారత్ కు అక్రమంగా నిజంగా ప్రేమ కోసమే వచ్చాడా.? లేక ఏదైనా కుట్ర కోణం ఉందా.? అని పలు ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పాకిస్తానీ ఫయాజ్ కు ఉన్న సంబంధాలపై అధికారులు నిఘా పెట్టారు.హైదరాబాదీ అమ్మాయిని ఫయాజ్ పెళ్లి చేసుకోవడంలో కుట్ర కోణం ఉందా అన్న విషయంలో దర్యాప్తు సాగుతోంది.
ఫయాజ్ నేపాల్ మీదుగా హైదరాబాద్ వచ్చేందుకు అత్తమామలు సహకరించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫయాజ్ కోసం ఆధార్ కార్డు సైతం సృష్టించారు అత్తమామలు.
ఈ మేరకు రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు అత్తమామలపై కేసు నమోదు చేశారు.అయితే ప్రస్తుతం ఫయాజ్ అత్తమామలు పరారీలో ఉన్నారని తెలుస్తోంది.