సాధారణంగా కూతురికి తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో తండ్రికి కూడా కూతురిపై అంతే ప్రేమ ఉంటుంది.కొడుకుల కంటే కూతుర్లని తండ్రి ( father daughter )ఎక్కువగా ప్రేమిస్తాడు.
చిన్నతనం నుంచి గారాబం చేస్తాడు.ఇక ఆమెకు పెళ్లి చేసేటప్పుడు తండ్రి మరింత ఎమోషనల్ అవుతాడు.
సాగనంపే సమయంలో కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు.అంత గొప్ప ప్రేమ తండ్రికి కూతురుపై ఉంటుందని అనడంలో సందేహం లేదు.
అయితే తాజాగా ఒక కూతురు తన పెళ్లి వేడుకలో డ్యాన్స్( wedding ceremony ) చేసి తన తండ్రిని భావోద్వేగానికి లోను చేసింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు గ్రాండ్‌గా జరుగుతున్న ఒక పెళ్లి వేడుక కనిపిస్తుంది.ఆ పెళ్లి వేడుకలో ఒక స్టేజి పైన అందంగా ముస్తాబైన వధువు క్యూట్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ కనిపించింది.బ్యాక్‌గ్రౌండ్‌లో దిల్బరో పాట వినిపిస్తుండగా దానికి ఈ వధువు చాలా అందంగా డ్యాన్స్ చేస్తోంది.
కూతురు అలా స్టెప్పులు వేస్తుంటే చూస్తూ ఉండిపోయాడు తండ్రి.కాసేపటికి ఆ తండ్రి భాగోద్వేగానికి లోనయ్యాడు.
ఆ తర్వాత ఆనందంతో ఆనంద భాష్పాలు కార్చాడు.
అనంతరం స్టేజి మీదకు వెళ్లి తన కూతురి పక్కన నిల్చని ఆమె కోసం ఒక పద్యం కూడా చెప్పి ఆశ్చర్యపరిచాడు.ఆ పద్యానికి ఆమె మంత్రముగ్ధులయింది.వధువు ఎమోషనల్ ( bride is emotional )అవుతూ తన తండ్రిని హత్తుకుంది.
ఈ దృశ్యాలను చూసి అతిథుల మనసులు పులకరించాయి.ఒక వ్యక్తి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ షాదీబీటీఎస్ షేర్ చేసింది.దీన్ని చూసి వావ్, హార్ట్ టచింగ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ బ్యూటిఫుల్ వీడియోని మీరు కూడా చూడండి.