బాలీవుడ్ ప్రేమపక్షులుగా విహరిస్తున్నటువంటి ఆలియా భట్, రణబీర్ కపూర్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏప్రిల్ 14వ తేదీ వివాహబంధంతో ఒక్కటయ్యారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా రణబీర్ అలియా జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే సన్నీ కాస్త ఫన్నీగా రియాక్ట్ కావడంతో ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సన్నీ రణబీర్ కపూర్ అలియా పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ కంగ్రాట్స్ అంటూ చెబుతూనే తల పట్టుకుని వెళ్తున్నా అన్నట్టుగా ఉన్న ఏమోజీని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.సన్నీ అలియా పెళ్లి పై ఇలా స్పందించడానికి గల కారణం మనకు తెలిసిందే.
సన్నీ అలియా భట్ కు వీరాభిమాని.తాను జర్నలిస్ట్ గా ఉన్న సమయంలో అలియా భట్ ను కలిసి తనతో బాలకృష్ణ డైలాగ్ దబిడి దిబిడే అనే డైలాగ్ ను చెప్పించిన ఘనత సన్నీకే చెల్లింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు గ్రాండ్ ఫినాలేలో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి ఆలియా రావడంతో సన్నీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక సన్నీ నేర్పించిన బాలకృష్ణ డైలాగ్ బిగ్ బాస్ వేదికపై చెబుతూ సన్నీని సర్ప్రైస్ చేయడమే కాకుండా అతనికి ఐ లవ్ యు అని చెప్పడంతో మనోడి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.ఈ విధంగా ఆలియా వీరాభిమానిగా ఉన్నటువంటి సన్నీ తన పెళ్లి కావడంతో ఇలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.ప్రస్తుతం సన్నీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.