ఒడిశాలో న్యూస్ చదివిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI న్యూస్ యాంకర్ పేరు లిసా..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial intelligence ) అన్ని రంగాల్లోకి ప్రవేశించడం మొదలు పెట్టేసింది.ఇక న్యూస్ యాంకర్ గా మారి టకటక న్యూస్ చదివేయడం విదేశాలకు మాత్రమే పరిమితం కాలేదు.

 The Artificial Intelligence That Read The News In Odisha The Name Of The Ai New-TeluguStop.com

భారతదేశంలో కూడా దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లు వస్తున్నారు.తాజాగా ఒడిశా( Odisha )లోని ఓ ప్రైవేట్ ఛానల్ భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ ను ప్రవేశపెట్టింది.

ఈ యాంకర్ ఒడిస్సా సాంప్రదాయ చేనేత చీర ధరించి వార్తలు చదువుతోంది.ఈ యాంకర్ పేరు లిసా.

ఈ యాంకర్ ఒడియా, ఇంగ్లీష్ లలో వార్తలు చదువుతుంది.టెలివిజన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ప్రధాన యాంకర్ గా బాధ్యతలు నిర్వహించనుంది.</br)

టీవీ బ్రాడ్ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ యాంకర్ లిసా ప్రపంచంలో ఉండే అన్ని భాషలలో మాట్లాడగలుగుతుంది.లిసా పేరుతో OTV యాజమాన్యం సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా ఓపెన్ చేసింది.అయితే లిసాకు శిక్షణ ఇవ్వడానికి తాము చాలా కష్టపడ్డామని OTV డిజిటల్ బిజినెస్ హెడ్ లితీశా మంగత్ పాండా వెల్లడించారు.

తాము ఇంకా లీసాకు అన్ని కోణాల్లో శిక్షణ ఇస్తూనే ఉన్నాం అని తెలిపారు.త్వరలోనే ఈ లిసా ఇతరులతో సులభంగా సంభాషించగలిగే స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

OTV అనేది భువనేశ్వర్( Bhubaneswar ) కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్వర్క్ యాజమాన్యంలో కొనసాగుతోంది.ఈ చానల్ ను జాగి మంగత్ పాండా ప్రారంభించింది.ఒడిశా టెలివిజన్ ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా.997లో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ లలో ఒడిశా టెలివిజన్ ప్రసారాలను ప్రారంభించింది.ఒడిశా ప్రజలు వార్తలు చదువుతుంది అమ్మాయి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube