విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఈ పర్యటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఫిర్యాదులు, నిరసనల హోరుతో వైజాగ్ రాజకీయం రాజుకుంటోంది.ఈనెల 11, 12 తేదీల్లో మోదీ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.11వ తేదీ సాయంత్రం వైజాగ్ కు చేరుకోనున్న ఆయన 12వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఇప్పటికే ముందు జాగ్రత్తగా విశాఖ పోలీసులు పలు ఆంక్షలను విధించారు.దీనిలో భాగంగా మద్దిలపాలెం జంక్షన్ ఆర్చి మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ప్రధాని సభ ముగిసేంత వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.ఈ మేరకు పీఎంఓకు ఏపీ ప్రభుత్వం లేఖను పంపింది.
ఓ వైపు ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని ప్రజా సంఘాలు చెబుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో వైసీపీ విధ్వంసకాండను మోదీకి వివరిస్తామని టీడీపీ తెలిపింది.
అదేవిధంగా బీజేపీ సైతం ఏపీ సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్తామంటోంది.అయితే, రాజకీయాలకు అతీతంగా ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్నారన్న వైసీపీ .టూర్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోన్న విషయం తెలిసిందే.