రంగారెడ్డి జిల్లా జన్వాడలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ముగ్గురు యువకులు చేసిన దాడి నేపథ్యంలో పెట్రోల్ బంక్ సిబ్బంది అయినా సంజయ్ మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మృతుడు సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.సంజయ్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా నిందితులు అనోక్, మల్లేశ్, నరేందర్ లపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.అయితే అర్థరాత్రి పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగినందుకు బంక్ సిబ్బందిపై యువకులు దాడి చేసిన సంగతి తెలిసిందే.