నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీమంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే శిల్పా బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ చేసారు.నంద్యాల గాంధీ చౌక్ లో ఎమ్మెల్యే అక్రమాలు బయటపెడతానని భూమా తెలిపారు.
ఈ క్రమంలో భూమా అఖిలప్రియను నంద్యాల వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు.
అనంతరం భూమా అఖిలప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.