తెలుగులో రామకృష్ణ అలియాస్ రామ్కి టెంప్ట్ రాజా అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో రామ్కి మెయిన్ లీడ్ పాత్రలో కూడా నటిస్తున్నాడు.
డిగ్రీ కాలేజ్ చిత్రంలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన బ్యూటీ దివ్య రావు మరియు అస్మా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.
అయితే ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని ఒకసారి పరిశీలిస్తే మొదటగా తెలుగులో మంచి పాపులర్ అయినటువంటి గోపమ్మ చేతిలో గోరుముద్ద అనే పాట తో హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ చూపించారు.అంతా ఓకే గాని చివరగా హీరో పక్కన హీరోయిన్లు ఉండగానే అరటి పండు దుప్పట్లో ఉంచి కొంతమేర డిఫరెంట్ గా చూపించినప్పటికీ ఎందుకో అభిమానులు దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అందుకే సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు మీమ్స్ క్రియేటర్స్ ఈ మోషన్ పోస్టర్ పై జోకులు పేలుస్తున్నారు.
దీనికితోడు తెలుగులో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి కూడా ఇలాంటి అడల్ట్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడంతో సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.
కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేగాక తొందరలోనే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి మరిన్ని వివరాలను తెలియజేస్తామని హీరో మరియు నిర్మాత రామ్కి తెలిపారు.
మరి టెంప్ట్ రాజా ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి…