ఆయన చేసిన పనికి చితక బాదాలి అనిపించిందన్న నటి ఐశ్వర్య..

ఒక్కోసారి కొంత మంది చేసే కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.తమ ఎదుట చక్కగా మాట్లాడే వారు పక్కకు వెళ్లగానే చెడుగా చెప్తారంటుంది నటి ఐశ్వర్య.

 Actress Aishwarya About Incident That Happen In Her Life Details, Actress Aishwa-TeluguStop.com

సీనియర్ నటి లక్ష్మీ కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈమె.ఒకానొక సమయంలో ఓ దర్శకుడిని చితక బాదాలి అన్నంత కోపం వచ్చిందని చెప్పింది.అతడు చేసిన పనికి తన్నాలి అనిపించినా.ఓర్చుకున్నానని చెప్పింది.చాలా కాలం తర్వాత మళ్లీ తను కనిపిస్తే మర్యాదగా బాగున్నారా? సర్ అని అడిగితే.బాగున్నాను అని చెప్పి.

పక్కకు వెళ్లి మళ్లీ తన గురించి ఏదో నెగిటివ్ గా చెప్పాడని వెల్లడించింది.ఆ రోజు కొట్టకుండా వదిలేసి తప్పు చేసినట్లు చెప్పింది ఐశ్వర్య.

వాస్తవానికి ఐశ్వర్య టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.

నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది.ప్రస్తుతం తను చెన్నై సమీపంలో ఉంటుంది.

చివరగా తను తెలుగులో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబి సినిమాలో తల్లితో కలిసి నటించింది.అటు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమా పరిశ్రమలలో పలు సినిమాలు చేసింది.

ఈమె తాజాగా అలీతో సరదాగా అనే షోలో పాల్గొంది.పలు ఆసక్తికర విషయాలను చెప్పింది.

Telugu Actress Lakshmi, Alitho Saradaga, Senioractress-Movie

తనకు శాంతా మీనా అనే పేర్లు కూడా ఉన్నట్లు చెప్పింది.అంతేకాదు.తన తల్లికి ఇలాంటి అమ్మాయి పుట్టిందేంటి అని చాలా మంది అనుకున్నారని చెప్పింది.తన కంటే తన అమ్మ చాలా బాగుంటుందని వెల్లడించింది.తన తల్లికి మాత్రం నేనంటే చాలా ఇష్టం అని చెప్పింది.

Telugu Actress Lakshmi, Alitho Saradaga, Senioractress-Movie

తాను తన భర్తతో విడిపోయినట్లు వెల్లడించింది.అతడు మరో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాడని చెప్పింది.తనకు ఓ పాప ఉందని.

అందరం కలిసి ఆ అమ్మాయి పెళ్లి చేసినట్లు చెప్పింది.తన కెరీర్ లో ఓ దర్శకుడు తప్ప.

మిగతా అందరు తనకు గురువులతో సమానం అని చెప్పింది.వాస్తవానికి తాను ఇండస్ట్రీలోకి వస్తాను అనుకోలేదని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube