తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే చంద్ర ముఖి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను బాగా అలరించింది ప్రముఖ సీరియల్ నటి శ్రీ వాణి.గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే నటి శ్రీ వాణి తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వైవాహిక జీవితం మరియు సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తనకి పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తన భర్త విక్రమాదిత్య ప్రేమ ప్రపోజ్ చేశాడని చిన్నప్పటినుంచి విక్రమాదిత్య తనకు బాగా తెలియడంతో మరియు మంచి వాడు కావడంతో వెంటనే తన ప్రేమకు ఓకే చెప్పానని తెలిపింది.
అయితే ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయామని కానీ చివరికి ఇరువురి తల్లిదండ్రులు మాత్రం ఇంటికి పిలిపించి మళ్ళీ ఘనంగా పెళ్లి చేశారని చెప్పుకొచ్చింది.తన అత్తమామలు తనను కన్న కూతురిలా చూసుకుంటారని ప్రేమానురాగాలకు ఎలాంటి లోటు లేదని తెలిపింది.
ఇక తన భర్తకి సడన్ సర్ప్రైస్ లు ఇవ్వడం చాలా అలవాటని అంతేకాకుండా అప్పుడప్పుడు అడ్వెంచరస్ కూడా చేస్తుంటాడని తెలిపింది శ్రీవాణి.
ఇక తన నటనా జీవితం గురించి శ్రీ వాణి స్పందిస్తూ తనకి చంద్ర ముఖి సీరియల్ చాలా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిందని తెలిపింది.అలాగే ఈ సీరియల్ లో నటించడానికంటే ముందుగా “సినీ రంజని” అనే ప్రోగ్రాం లో యాంకర్ గా వ్యవహరించే దానినని అందుకుగాను తనకి రోజుకి 350/- రూపాయల పారితోషకం ఇచ్చే వాళ్లని తెలిపింది.అయితే తనకి సీరియళ్లలో కామెడీ సన్నివేశాలలో నటించడం పెద్దగా ఇష్టం ఉండదని కానీ “కలవారి కోడళ్లు” సీరియల్ లో నటిస్తున్న నటీనటులు మరియు దర్శకుడి కోసం తప్పక నటించాల్సి వచ్చిందని తెలిపింది.
కాగా ప్రస్తుతం శ్రీ వాణి కి ఒక పాప కూడా ఉంది.ఇటీవలే శ్రీ వాణి కూతురు బుల్లితెర తెరంగేట్రం కూడా చేసినట్లు సమాచారం.