సినిమా ఇండస్ట్రీలో పగలు అమ్మ అని పిలుస్తారు... కానీ రాత్రికి రమ్మంటారు... 

ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న “లైంగిక వేధింపుల” విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన పెరగడంతో కొందరు మహిళలు తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి  ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు.మరికొందరైతే ముందు కమిట్మెంట్లు ఇచ్చి అవకాశాలు రాక మీడియా ముందుకు వస్తున్నారు.

 Telugu Junior Artist Sunitha Reddy Sensational Comments On Casting Couch, Sunith-TeluguStop.com

అయితే తాజాగా పలు చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి జూనియర్ ఆర్టిస్ట్ సునీత రెడ్డి తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి యూట్యూబ్ ద్వారా తన గళాన్ని విప్పింది.

అయితే ఇందులో ప్రస్తుతం కొందరు దర్శక సినీ నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో పలు ఏజెన్సీలను సంప్రదిస్తున్నారని దీంతో ఈ ఏజెన్సీల వారు జూనియర్ ఆర్టిస్టులకు అన్యాయం చేస్తున్నారని వాపోయింది.

అంతేగాక తాము పని చేసిన అనంతరం ఇచ్చేటువంటి పారితోషికం విషయంలో కూడా మోసాలు చేస్తున్నారని కాబట్టి ఇలాంటి ఏజెన్సీల వారిని నిషేధించాలని పలువురు సినీ పెద్దలు ని కోరింది.సినిమా లేదా సీరియళ్ళకి జూనియర్ ఆర్టిస్టులు ఎంతగానో కష్టపడి పని చేస్తారని అలాంటి వారి అవకాశాలకు  ఏజెన్సీలు గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ కొందరు “పగటి పూట అమ్మ అని పిలుస్తూ రాత్రిపూట తమ గదుల్లోకి రమ్మంటారని” అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.అలాగే  జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చేటువంటి వేతనాలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయాలని లేదంటే మధ్యలో ఏజెన్సీ వారు కమిషన్ల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube