విజయవాడలోని యూటీఎఫ్ కేంద్ర కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు దీక్షకు దిగారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని టీచర్స్ డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం టీచర్ల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని తెలిపారు.
కానీ నాలుగేళ్లు అయినా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని ఆరోపించారు.సీపీఎస్ కు బదులు జీపీఎస్ తీసుకు వస్తున్నామంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
లేని పక్షంలో ఐక్య ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.అదేవిధంగా సీపీఎస్ రద్దు కోరుతూ ఈనెల 24న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు.