చాలామంది ఇండస్ట్రీలో పైకి ఎదిగిన ఏ ఒకరిద్దరిలో మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ ఎదగడానికి కష్టపడి ఓడిపోయిన వారిని ఈ సమాజం పెద్దగా గుర్తించదు అందుకే బాలసుబ్రమణ్యం అందరిని తొక్కేశాడు అని ఒక ప్రచారం బాగా నడిచింది అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే వాని జయరాం సంగీత ప్రపంచంలో రాజకీయాలకు బలైపోయింది అనేది మాత్రం అక్షర సత్యం.భారతీయ సంగీత పరిశ్రమ అని చెప్పగానే అందరికీ బాలీవుడ్ మాత్రమే గుర్తుకు వస్తుంది అందుకే వాణి జయరాం సైతం హిందీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది తొలినాలలో ఆమె పైకి ఎదిగిన విధానం అందరికీ కన్ను కట్టేలా చేసింది.
గాయకురాలు వాణి జయరాం మరణించిన తర్వాత ఆమె చుట్టూ అనేక కథలను అల్లుతున్నారు.ఆమె చనిపోయిందా ? చంపబడిందా ? ఆకస్మిక మరణం.మిస్టరీగా మరణం అంటూ అనేక కథనాలు వెలువడుతున్నాయి.అయితే వాటిలో వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటికి ఒక నిర్ధారణకు రాకపోయినా ఆమె జీవితం మాత్రం చాలా భిన్నమైన విషయాల మేలవింపుగా కనిపిస్తోంది.
వాణి జయరాం చాలా సున్నిత మనస్కురాలు.ఆమెను తామరాకుపై నీటి బొట్టుతో పోల్చుతారు చాలామంది.భారత నైటింగేల్ స్థానానికి ఎదుగుతున్న సమయంలో ఆమె కొంతమంది రాజకీయాలకు బలైపోయింది అంటూ ఉంటారు.ఆ విషయాలను ఆమె కూడా పలు ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నారు.ఇక ఆశ మరియు లత ఇద్దరు కూడా అప్పటికే బాలీవుడ్లో టాప్ సింగర్స్ గా కొనసాగుతున్నారు కాబట్టి వారు నేర్పిన రాజకీయాలకు వాణీ జయరాం నెగ్గలేకపోయారు.అయినా కూడా తన లైఫ్ లో ఎలాంటి రెగ్యురేట్స్ లేవని చెప్తూ ఉండడం వాణీ గొప్పతనం.
ఇక బాలీవుడ్ లో తనకు స్థానం లేదు అనుకొని మద్రాస్ కు తన మకాం మార్చుకుంది.భర్తతో కలిసి మద్రాసులోనే బ్రతికింది.వాణి భర్త కూడా సంగీతకారుడు మరియు వాద్యకారుడు కూడా.ఇద్దరూ సంగీత ప్రపంచంలోనే ఎన్నో ఏళ్లు కలిసి జీవించారు.
ఈ జంటకు పిల్లలు లేరు.జీవించినంత కాలం చాలా నిరాడంబరంగా జీవించారు.
వారు సంపాదించిన భాగంలో ఎక్కువ భాగం పరుల కోసమే ఖర్చు పెట్టారు.
కేవలం వాణి జయరాం పాటలు పాడటం మాత్రమే కాకుండా మంచి పెయింటర్ కూడా.
వాణి వేసిన పెయింటింగ్స్ చాలా ఆదరణ పొందాయి.జీవితమంతా కూడా తనకంటూ తాను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని బ్రతికింది.
ఏ పెళ్లిల మేలాల్లో ఆమె పాటలు పాడదు గుడులలో భజనలు చేయదు.కానీ భక్తి పాటలు పాడడానికి మాత్రం ఎల్లప్పుడూ ముందుంటుంది అవే తనకు ఒక ప్రశాంతతను ఇస్తాయని వాణి చివరి వరకు నమ్మింది.