Tamilnadu Sindhu Monika: ఇలాంటి రికార్డ్స్ కూడా ఉంటాయా? 55 లీటర్ల చనుబాలు దానం చేసిన మాతృమూర్తి!

మీరు విన్నది నిజమే.ఫారిన్ కంట్రీలకే పరిమితమైన చనుబాలు దానం అనేది మనదగ్గర కూడా వుంది.

 Tamilnadu Woman Creates Record After Donating 55 Liters Of Breast Milk Details,-TeluguStop.com

ఈ పరిణామం మంచిదే అని చెప్పుకోవాలి.దేశం నలుమూలలా తల్లిపాలు లేక తల్లడిల్లుతున్న శిశువులు ఎంతమందో వున్నారు.

అలాంటివారికి ఇదొక సేవగా పనికొస్తుంది.తమిళనాడుకు చెందిన ఓ మహిళ గత పది నెలల్లో 55 లీటర్ల చనుబాలను సేకరించదానికి ఎంతో శ్రమకోర్చినది.

ఆ తరువాత ఆ మొత్తం పాలను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచి, పిన్నవయసులోనే మాతృమూర్తిగా అవతరించింది.

దాంతో ఆమె ‘ఆసియా అండ్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకుంది.

వివరాలికి వెళితే, కోయంబత్తూరు జిల్లా కారుమతంబట్టి సమీపంలోని కన్యూర్‌ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్‌ మహేశ్వర్‌, సింధు మోనికకు దాదాపు 6 సంవత్సరాల క్రితం పెళ్లయింది.వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది.

ఆమె పేరు వెంబా. దురదృష్టవశాత్తు వెంబాకి తలిపాలు పడకపోవడంతో డబ్బాపాలు పెట్టవలసి వచ్చింది.చనుబాల విలువ ఆ తల్లిదండ్రులకు తెలిసింది.దాంతో చనుబాలు చేయడం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా సింధు మోనిక తెలుసుకున్నారు.

Telugu Asia, Breat Milk, Maheshwar, Sindhu Mounika, Tamilnadu, Latest-Latest New

తెలుసుకున్నది తడవుగా తిరుపూర్‌ జిల్లా అవినాసి ప్రాంతంలో తల్లి పాల నిల్వ కోసం పనిచేస్తున్న ‘అమృతం థాయ్‌ పల్‌ దానం’ అనే సంస్థ గురించి తెలుసుకొని వారిని సంప్రదించారు.తల్లి పాలను ఎలా నిల్వ చేయాలి, ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? అనే అంశాలపైన అవగాహన తెలుసుకున్నారు.ఈ నిబంధనలను పాటించిన సింధు మోనిక గత 10 నెలల్లో 55 లీటర్ల పాలను సేకరించి, కోయంబత్తూరులో గల ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు.ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ఆసియా, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ప్రతినిధులు మంగళవారం ధ్రువపత్రాన్ని అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube