ప్రభుత్వ పాఠశాల కోసం 7 కోట్ల రూపాయల భూమిని విరాళంగా ఇచ్చిన మహిళ.. గ్రేట్ అంటూ?

మన దగ్గర ఉన్న సంపదను ఇతరులకు దానం చేయాలంటే మంచి మనస్సు ఉండాలి.ప్రస్తుత కాలంలో ఇతరులకు రూపాయి దానం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించే వాళ్లు ఎక్కువగా ఉన్నారు.

 Tamilnadu Woman Aayi Pooranam Ammal Donated 7cr Land To Goverenment School Inspi-TeluguStop.com

అయితే ఒక మహిళ మాత్రం ఏకంగా 7 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేసింది.ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాతృత్వాన్ని చాటుకున్న ఆ మహిళ మంచితనాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Telugu Aayipooranam, Bank Clerk, Cm Stalin, School, Madurai, Tamil Nadu, Tamilna

ఆ మహిళ పేరు ఆయిపురాణం అమ్మాళ్( Aayi Pooranam Ammal ) కాగా బ్యాంక్ లో క్లర్క్ గా పని చేస్తున్న ఆమె తన మంచి మనస్సును చాటుకున్నారు.ప్రభుత్వ పాఠశాల( Government School ) విస్తరణ కోసం ఆమె తన భూమిని దానంగా ఇచ్చారు.తమిళనాడు రాష్ట్రంలోని మధురై ( Madurai ) ప్రాంతానికి చెందిన ఆయిపురాణం అమ్మాళ్ విద్యార్థుల శ్రేయస్సు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

Telugu Aayipooranam, Bank Clerk, Cm Stalin, School, Madurai, Tamil Nadu, Tamilna

ఒట్టకుడై ప్రాంతానికి సమీపంలో ఉన్న భూమిని( Land ) ఆమె దానం చేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ప్రభుత్వం పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన ఆయిపురాణం అమ్మాళ్ తమిళనాడు విద్యాశాఖ అధికారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందించారు.ఈ విషయం తెలిసిన తమిళనాడు సర్కార్( Tamilnadu Government ) ఆమెకు ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం( Republic Day ) సందర్భంగా అవార్డ్ ను అందించనున్నారని తెలుస్తోంది.

Telugu Aayipooranam, Bank Clerk, Cm Stalin, School, Madurai, Tamil Nadu, Tamilna

ఆయిపురాణం అమ్మాళ్ తీసుకున్న నిర్ణయం వల్ల వేల సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆమె తమిళ సమాజానికి చిహ్నంగా నిలిచారని విద్య, బోధన అత్యుత్తమ ధర్మమని స్టాలిన్( CM Stalin ) ట్వీట్ లో పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం రోజున అమ్మాళ్ ను ప్రత్యేక అవార్డ్ తో సత్కరిస్తామని స్టాలిన్ ట్వీట్ లో పేర్కొన్నారు.ఆయిపురాణం అమ్మాళ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అమ్మాళ్ కు దేవుని అనుగ్రహం ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube