టీ కాంగ్రెస్ లో మరో చిచ్చు.. 20 సీట్లు మాకే ఇవ్వాలని డిమాండ్..!!

కాంగ్రెస్ ( Congress ) అంటేనే అతిపెద్ద రాజకీయ పార్టీ.ఈ పార్టీలో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉన్నారు.

 T Congress Women Congress Leaders Demand To Give 20 Seats Details, Aicc, Congre-TeluguStop.com

అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా గల్లి నుంచి ఢిల్లీ వరకు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.నేతల మధ్య సఖ్యత కుదరక పార్టీ చాలా రాష్ట్రాల్లో చతికిల పడుతూ వచ్చింది.

కానీ గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడోయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టి కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకువచ్చారు.ఇదే తరుణంలో కర్ణాటకలో పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాస్త ఊపు అందుకుంది.

ఆ ఊపుతోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు.ఇదే తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల విషయంలో అధిష్టానం తర్జన భర్జన అవుతున్నారు.

ఇప్పటివరకు ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడంతో ఒక్కో నియోజకవర్గంలో నుంచి మూడు నుంచి నాలుగు దరఖాస్తులు వచ్చాయి.ఈ క్రమంలోనే స్క్రీనింగ్ కమిటీ నియోజకవర్గంలో ఎవరికైతే ప్రజల ఆదరణ ఉంటుందో వారికే టికెట్ తప్పనిసరిగా కేటాయిస్తామని పైరవీలకు తావు లేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పదేపదే చెబుతూ వస్తున్నారు.

ఆ విధంగానే స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులు పరిశీలించి అందులో నుంచి కొంత మంది పేర్లు పరిశీలనలోకి తీసుకుంది.వారి పేర్లను బట్టి ఆయా నియోజకవర్గాల నుంచి సర్వే ఆధారంగా టికెట్లు కేటాయించబోతోంది.

అంతేకాకుండా ఈ టికెట్ల విషయంలో బీసీలకు 30 సీట్ల వరకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే బీసీ నేతలు అంతా ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిశారు.

Telugu Tickets, Aicc, Bc, Congress, Kc Venugopal, Revanth Reddy, Sunitharao-Poli

దీంతో ఈ సారి బీసీలకు కూడా ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి రెండు నుంచి మూడు టికెట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదే తరుణంలో కాంగ్రెస్ అధిష్టానానికి మరో ట్విస్ట్ ఇచ్చారు మహిళ కాంగ్రెస్ నేతలు. 20 టికెట్లు మహిళలకు కేటాయించాలని వారు కోరుతున్నారు.తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు(Sunitha Rao) నేతృత్వంలో మహిళా నేతలంతా కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను(KC Venugopal) కలిసారట.

మొత్తం 20 టికెట్లు కేటాయించాలని కోరారట.

Telugu Tickets, Aicc, Bc, Congress, Kc Venugopal, Revanth Reddy, Sunitharao-Poli

తెలంగాణలో చాలామంది మహిళా కాంగ్రెస్ నేతలు పోటీకి సిద్ధంగా ఉన్నారని వారు నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నారని అలాంటి నేతలకు తప్పనిసరిగా టికెట్లు కేటాయించాలని కోరారట.ఒకవేళ మహిళ నేతలకు టికెట్లు ఇవ్వకుంటే మాత్రం ముందు ముందు పరిణామాలు మరో విధంగా ఉంటాయని సునీతా రావు(Sunitha Rao) అధిష్టానానికి చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.ఇంకో వారం రోజుల్లో టికెట్లు డిక్లేర్ చేసే సమయంలో మహిళ నేతలు ఈ ట్విస్ట్ ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube