కలర్స్ అనే బుల్లి తెర కార్యక్రమం తో ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన స్వాతి ఆ తర్వాత ఎన్నో బుల్లి తెర కార్యక్రమాల్లో పాల్గొంది.ఆ తర్వాత ఆమె వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది.
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమా తో పాటు ఇంకా చాలా సినిమా ల్లో నటించింది.అష్టా చెమ్మా సినిమా( Ashta Chamma ) తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న స్వాతి ఆ తర్వాత ఇతర భాషల సినిమాల్లో నటించడం ద్వారా అక్కడ పాపులారిటీని సొంతం చేసుకుంది.
మొత్తానికి స్వాతి తెలుగు తో పాటు ఇతర భాషల్లో మంచి పాలోయింగ్ ని దక్కించుకుంది.అయితే స్వాతి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
భర్త తో విభేదాలు అనే పుకార్లు ఆ మధ్య వచ్చాయి.ఆ విషయమై క్లారిటీ లేదు.
కానీ తాజాగా నటిగా ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇచ్చింది. మంత్ ఆఫ్ మధు( Month Of Madhu ) అనే సినిమా తో ఇండస్ట్రీ లో మళ్లీ అడుగు పెట్టిన ముద్దుగుమ్మ స్వాతికి నిరాశే మిగిలింది.ఈసారి కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాను.యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇప్పటి వరకు స్వాతి కి ఈ సినిమా తో దక్కింది ఏమీ లేదు.
దాంతో ఇక పై స్వాతి హీరోయిన్ గా నటించడం కంటే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టుకోవడం ఉత్తమం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోయిన్ గా నటించిన స్వాతి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే కచ్చితంగా మంచి ఆఫర్లు వస్తాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి స్వాతికి ( Swathi Reddy )క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే ఆసక్తి ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.