ఈ కాలంలో ఫోన్ కు జనాలు బాగా అడిక్ట్ అయిపోయారు.నిద్రాహారాలు లేకపోయినా బ్రతకకలుగుతున్నారు గాని ఫోన్ లేకుండా మాత్రం జనాలు బతకలేకపోతున్నారు.ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోయి వీడికి ఎమన్నా పైత్యమా అని అనుకుంటారు.
అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఏమి చేసాడో తెలుసా? ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.తీరా మింగిన తరువాత ప్రాణం మీద భయంతో ఆసుపత్రికి పరుగులెత్తాడు.
డాక్టరు ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి అతని ప్రాణాలు కాపాడారు.ఆ వ్యక్తికి సర్జరీ చేసిన ఒక వైద్యుడు సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన ఎక్స్ రే, ఫోన్ ఫోటోలను షేర్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
వాటిని చూసిన ప్రతి ఒక్కరు ఇదెక్కడి చోద్యం అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
అసలు వివరాల్లోకి వెళితే.కొసావో రాజధాని ప్రిస్టినాకు చెందిన 33 ఏళ్ల ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ఫోన్ ను ఉన్నటుండి మింగేశాడు.
ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.మరి అతను ఎందుకు ఆ ఫోన్ ను మింగాడో అనే వివరాలు తెలియలేదు.కానీ మింగిన తరువాత ఎక్కడ ప్రాణాలు పోతాయేమో అనే భయంతో హాస్పిటల్ కు పరుగులెత్తాడు.హాస్పిటల్ కి వెళ్లే క్రమంలోనే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

డాక్టర్లకు జరిగినదంతా చెప్పడంతో విషయం అక్కడి డా.స్కెందర్ అతగాడి పొట్టను స్కాన్ తీసి చూడగా కడుపులో ఉన్న నోకియా ఫోన్ మూడు భాగాలుగా విడిపోయి ఉందట.అయితే మింగినది ఏమి చిన్న వస్తువు కాదు కదా.అందుకే ఫోన్ భాగాలు కడుపులో నుంచి తీయడానికి రెండు గంటలపాటు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.దేవుడి దయవల్ల ఆపరేషన్ విజయవంతం అవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.అయితే ఆ డాక్టర్ ఫోన్ కడుపులో ఉన్నప్పుడు తీసిన ఎక్స్-రే, ఎండోస్కోపీ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కానీ అతను మాత్రం ఎందుకు ఫోన్ మింగావని డాక్టర్ ఎన్ని సార్లు అడిగిన చెప్పలేదట.