బ్రిటన్: మానసిక సమస్యలతో సతమతం.. సెలవు నుంచి తిరిగొచ్చిన భారత సంతతి ఎంపీ

మానసిక సంబంధిత సమస్యలతో బాధపడుతూ సెలవుపై వున్న భారత సంతతికి చెందిన బ్రిటీష్ పార్లమెంట్ సభ్యురాలు నదియా విట్టోమ్ కోలుకున్నారు.ఇకపై పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతానని ఆమె ప్రకటించారు.

యూకేలో పంజాబీ కుటుంబంలో జన్మించిన విట్టోమ్.2019 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఈమె సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని నాటింగ్ హామ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అంతేకాదు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కారు.ఆమెను ‘‘బేబీ ఆఫ్ ది హౌస్ ’’ అని సహచర ఎంపీలు పిలుస్తూ వుంటారు.నదియా వయసు కేవలం 25 సంవత్సరాలే.

తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానని.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి విధులకు హాజరవుతానని నదియా సోమవారం సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

సెలవులో వున్న సమయంలో తనకు అండగా నిలిచిన వారికి , తన పరిస్థితిని అర్ధం చేసుకున్న వారికి నదియా ధన్యవాదలు తెలియజేశారు.పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ)తో బాధపడుతున్న నదియా.

Advertisement

చికిత్స, ఈ సమయంలో మానసిక స్థితి సహా తన అనుభవాన్ని పంచుకున్నారు.తన వ్యాధి నయం అయిందని బహిరంగంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.

ఇదే సమయంలో కార్మికుల సమస్యలపై నదియా ప్రస్తావించారు.దేశంలో జీవించగల వేతనాలు, బలమైన కార్మికుల హక్కులు ముఖ్యమని వాటిపై ఇకపై పోరాడతానని ఆమె చెప్పారు.

నదియా కోలుకోవడం పట్ల లేబర్ పార్టీ అధినేత సర్ కీర్ స్టార్మర్ హర్షం వ్యక్తం చేశారు.మీరు తిరిగి విధులకు హాజరవుతుండటం సంతోషంగా వుందంటూ ఓ వీడియో సందేశాన్ని ఆయన షేర్ చేశారు.

కాగా, ఈ ఏడాది మేలో తాను మానసిక రుగ్మతలతో బాధపడుతున్నానని.చికిత్స కోసం కొంతకాలం సెలవు తీసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా నదియా ప్రకటించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రాజకీయ నాయకురాలిగా నిజాయితీతో వుండటం ముఖ్యమని తాను భావిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని.

Advertisement

కానీ వాటి గురించి బయటకు చెప్పడానికి అవమానంగా భావిస్తూ వుంటారని నదియా తెలిపారు.అయితే తన మానసిక సమస్యల గురించి బహిరంగంగా చెప్పడం ద్వారా.

ఇతరులు కూడా వారి సమస్యలను బహిర్గతం చేయగలుగుతారని నదియా ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా, మార్చి 2020లో కరోనా వైరస్ ఉద్ధృతంగా వున్న సమయంలో నదియా.

కేర్ టేకర్‌గా తన మునపటి వృత్తిని నిర్వహిస్తూనే రాజకీయాల్లో భాగం పంచుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.అంతేకాదు ఎక్స్‌ట్రాకేర్ రిటైర్మెంట్‌ హోమ్‌లో తనకు లభించే వేతనాన్ని కోవిడ్ నిధికి విరాళంగా ప్రకటించింది.

తాజా వార్తలు