వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.టీచర్ కొట్టడం వలనే తమ బిడ్డ కార్తీక్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా కొట్టడంతో కార్తీక్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడని తెలుస్తోంది.చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన జరిగింది.
అయితే విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడటం వలనే మృతిచెందాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.