టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు అందరికీ మంచి చేస్తారని ఇండస్ట్రీలో పేరుంది.అలాంటి మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటం అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు.కృష్ణ మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
మహేష్ సోదరుడు రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన లివర్ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు.కొడుకు మరణం కృష్ణను ఎంతగానో బాధ పెట్టింది.
ఆ తర్వాత కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యల వల్ల కొంతకాలం క్రితం మృతి చెందారు.ఇందిరా దేవి మృతి వల్ల కృష్ణ మానసికంగా కృంగిపోయారు.
కన్నతల్లి మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మహేష్ బాబును తండ్రి మరణం మరింత బాధ పెడుతోంది.మహేష్ బాబు కష్టం ఎవరికీ రాకూడదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ బాధ నుంచి మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందారు.
కృష్ణను చివరిసారిగా చూడాలని ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కార్డియాక్ అరెస్ట్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో కృష్ణ మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.కృష్ణ అంత్యక్రియలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.సూపర్ స్టార్ కృష్ణ సినీ రంగానికి 55 సంవత్సరాలకు పైగా సేవలు అందించారు.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కృష్ణ రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు.