కరీంనగర్ జిల్లాలో సుపారీ గ్యాంగ్ కలకలం సృష్టించింది.18వ డివిజన్ మహిళ కార్పొరేటర్ ఇంటిపై గ్యాంగ్ సభ్యులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కార్పొరేటర్ మాధవి – కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారని సమాచారం.
అయితే రేకుర్తి మనోహార్, రౌడీషీటర్ రవి కలిసి స్కెచ్ వేశారని కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు.