ఫేడ్ ఔట్ అయ్యేలా ఉన్న సందీప్ కిషన్ కెరియర్ ఎందుకిలా జరిగిందంటే..?

ప్రస్థానం సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ ఈ సినిమా తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే చెప్పాలి ఈ సినిమాతో సందీప్ మంచి హిట్ అందుకొని ఇక ఇండస్ట్రీ లో ఒక మంచి హీరో దొరికాడు అని అందరూ అనుకునేలా చేశాడు.కానీ ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు సందీప్.

 Sundeep Kishan Career Fade Out ,sundeep Kishan , Tollywood , Michael , Vijay S-TeluguStop.com

ఇక ఈ సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా సందీప్ కెరియర్ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన మైకేల్ సినిమా కూడా ప్లాప్ కావడం తో సందీప్ ప్రస్తుతం చాలా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ ప్లాప్ అవుతున్నాయి ఇక దాంతో ఏం చెయ్యాలో సందీప్ కి తెలియట్లేదు ఇక వచ్చే రెండు మూడు సినిమాలు కూడా ఇలానే ఉంటే సందీప్ సిని కెరియర్ కి శుభం కార్డ్ పడ్డట్టే…

అందుకే ఇక రాబోయే సినిమాలు అయిన కొంచం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని చేస్తే మంచిది అని ఆయన ఫ్యాన్స్ ఆయన శ్రేయోభలాషులు చెప్తున్నట్టు తెలుస్తుంది.తన తోటి హీరోలు అయిన నాని, శర్వానంద్ లాంటి హీరోలు మంచి సినిమాలు చేస్తుంటే సందీప్ మాత్రం తనకు నచ్చిన సినిమాలు చేస్తూ పోతున్నాడు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడుతాయ లేదా అనే లెక్కలు ఏం పట్టించుకోవట్లేదు ఇలా ఉంటే కష్టం అని సినీ పెద్దలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది…

 Sundeep Kishan Career Fade Out ,sundeep Kishan , Tollywood , Michael , Vijay S-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube