అమెరికా రాజకీయాలలో భారతీయులు చక్రం తిప్పుతున్నారు.అనేక మంది భారత సంతతి వ్యక్తులు అమెరికాలో అనేక రంగాలలో స్థిరపడటమే కాకుండా ఎంతో ఉన్నతమైన స్థానాలని అధిరోహించారు.
అయితే మెల్ల మెల్లగా అమెరికా రాజకీయాల్లో కూడా భారతీయులు ఉన్నతమైన పదవులని అధిరోహిచడం భారతీయులకి ఎంతో గర్వ కారణంగా ఉంది.అయితే తాజాగా భారత సంతతి వ్యక్తి అమెరికాలో గవర్నర్ రేసులో ఉండటం సర్వత్రా చర్చనీయంసం అవుతోంది…వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని పలు రాష్ట్రాలకి ఎంతో మంది భారత సంతతి వ్యక్తులు గవర్నర్లుగా పనిచేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మరొక వ్యక్తి ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నరు రేసులో ఉన్నారు.అయితే ఈ భారతీయ వ్యక్తి వయసు తెలిస్తే షాక్ అవుతారు కూడా పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు కాలిఫోర్నియాలో తన ఐటీ పరిజ్ఞానం అంతా ఉపయోగించి మరీ ఓటర్లని ఆకర్షిస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ కి చెందినా శుభమ్ గోయల్ అమెరికాలో ఐటీ రంగంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు అతడి వయస్సు కేవలం 22 ఏళ్లు మాత్రమే…ఇప్పుడు ఈ కుర్రాడు కాలిఫోర్నియా గవర్నర్ పదవి కోసం పోటీ పడటం అక్కడి తలపండిన రాజకీయ నాయకులని సైతం ఆశ్చర్య పరుస్తోంది.డెమొక్రటిక్ గవర్నర్ జెర్రీ బ్రౌన్ కంటే తానెంత మెరుగైన వ్యక్తినో చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.
వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు.
అయితే ఈ భారతీయ యువకుడి దూకుడి కి కళ్ళెం వేయడం అక్కడి నాయకుల వల్ల కావడం లేదట అంతేకాదు ఈ యువకుడి గెలుపు ఖాయం అంటూ కొన్ని పత్రికలూ సైతం ముందుగానే వెల్లడించడం.
యువకుల సప్పోర్ట్ సైతం ఇతడికి ఉండటం ఎంతో కలిసి వస్తోందని భావిస్తున్నారు…అన్ని విధాలుగా కలిసి వచ్చి శుభమ్ గనుకా గవర్నర్ పదవి చేపడితే అతి చిన్న వయసులో గవర్నర్ గా ఎన్నికైన వ్యక్తిగా శుభం రికార్డులకి ఎక్కడం ఖాయం అంటున్నారు.