ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికాలో చదవాలనుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు.అక్కడే చదువుకొని స్థిరపడాలని ఎన్నో కలలు కంటుంటారు.
ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు.అమెరికా వీసా పొందుకోవటం కోసం అనేక రీతులుగా కష్టపడుతూ ఉంటారు.
కాగా తాజాగా ఆ దేశ ఎంబసీ అమెరికాలో పీజీ చదవాలి అనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేసింది.అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
గతంలో కోర్సు ప్రారంభానికి 120 రోజులు ముందు మాత్రమే వీసాలు… దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది.అయితే తాజాగా కొత్త విధానంతో ఈ పరిమితిని ఏడాదికి పెంచడం జరిగింది.ఈ నూతన వీసా విధానంతో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి.ఇదే సమయంలో వేసవిలో మరిన్ని విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామని అమెరికా ఎంబసీ స్పష్టం చేయడం జరిగింది.