విమానంలో వింత శబ్దాలు.. ప్రయాణికుడి వింత చేష్టలతో అంతా ఆందోళన

ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు కొన్ని వింత చేష్టలకు పాల్పడుతున్నారు.పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల విమానంలో నానా రభస సృష్టించాడు.

 Strange Noises In The Plane Everyone Is Worried About The Strange Antics Of Th-TeluguStop.com

ఏకంగా ఫ్లైట్ అద్దాన్ని పగలగొట్టడానికి యత్నించాడు.అయితే అతడిని విమాన సిబ్బంది కాళ్లూ, చేతులు కట్టేశారు.

ఇదే తరహాలో మరో వ్యక్తి విమాన సిబ్బందిపై పిడి గుద్దులు కురిపించాడు.ఫలితంగా విమాన ప్రయాణం చేయకుండా అతడిపై నిషేధం పడింది.

ఇన్ని జరుగుతున్నా, విమానంలో కొందరు ప్రయాణికుల చేష్టలు దారుణంగా ఉన్నాయి.తాజాగా ఓ ప్రయాణికుడు విమానంలో వింత శబ్దాలు చేశారు.

దీంతో ఆ విమానం హైజాక్ అయిందని కొందరు భావించారు.తీరా అది తాను చేసిన మిమిక్రీ అని ఆ ప్రయాణికుడు నెట్టింట పెట్టేవరకు ఎవరికీ తెలియదు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మీరు విమానంలో క్యాబిన్ సిబ్బంది డ్యాన్స్‌లు చేసిన కొన్ని వైరల్ వీడియోలను చూసి ఉండవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ భాషల్లో సూచనలను ప్రకటించడం, కొంతమంది ఎయిర్‌హోస్టెస్‌లు ట్రాన్స్‌పోర్ట్‌లో డ్యాన్స్ చేయడం మొదలైనవి గమనించి ఉండవచ్చు.అయితే విమానంలో లైంగిక శబ్దాలు వినపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సెప్టెంబరు 6, 2022 న లాస్ ఏంజెల్స్ నుండి డల్లాస్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.ఎమర్సన్ కాలిన్స్ అనే టీవీ వ్యక్తి చేసిన వైరల్ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

ఈ శబ్దాలు టేకాఫ్‌కు ముందు ఇంటర్‌కామ్‌లో ప్రారంభమై ఫ్లైట్ అంతటా కొనసాగాయి.ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటూ, కాలిన్స్ ఒక క్లిప్‌ను రికార్డ్ చేశాడు.అందులో ఈ ఫ్లైట్‌లో ఎవరో ఇంటర్‌కామ్ సిస్టమ్‌లోకి చొరబడినట్లు అనిపిస్తుందని, శృంగార శబ్దాలు వస్తున్నాయని చెప్పడం వినవచ్చు.ఓ ఫ్లైట్ అటెండెంట్ వచ్చి “లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.

పబ్లిక్ అనౌన్స్‌మెంట్‌.చాలా చికాకు కలిగించే ధ్వని వస్తుందని మేము గ్రహించాము.

ఫ్లైట్ డెక్ ట్రబుల్షూట్ చేయడానికి ప్రయత్నిస్తోంది.దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

కాబట్టి దయచేసి ఓపిక పట్టండి.ఇది చాలా విపరీతమైన క్రమరాహిత్యమని మాకు తెలుసు.

మనలో ఎవరూ దీన్ని ఆస్వాదించడం లేదు” అని పేర్కొంది.అయితే ఈ పని చేసిన కాలిన్స్ నవ్వుతూ వీడియోలో తన మాటలను రికార్డ్ చేశాడు.

దీనిని ట్విట్టర్‌లో పెట్టగా, విపరీతంగా వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube