నాన్న కమల్ హాసన్ నాకు ఇచ్చిన ఆస్తులివే.. శృతి కామెంట్స్ వైరల్?

కమల్ హాసన్ కుతురు శృతి హాసన్ ఏ విషయాన్ని మనస్సులో దాచుకోరనే సంగతి తెలిసిందే.జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న నటీమణులలో శృతిహాసన్ ఒకరు కాగా తాజాగా శృతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Star Heroine Shruti Hassan Comments About Her Father , Affection, Comments About-TeluguStop.com

లాక్ డౌన్ తర్వాత సెట్ లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని శృతి అన్నారు.భయం పోయిందని చెప్పను కానీ ఎన్నిరోజులు భయపడుకుంటూ కూర్చుంటామని ప్రశ్నించారు.

నాకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని శృతిహాసన్ కామెంట్లు చేశారు.నాన్న కూతురిని అనిపించుకోవడం తనకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు.తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సొంత డబ్బు అని ఫస్ట్ మూవీ తర్వాత నాన్నను తాను డబ్బులు అడగలేదని ఆమె అన్నారు.అయితే నాన్న కమల్ హాసన్ నుంచి కరుణ, ధైర్యం, ప్రేమ ఆస్తులుగా తెచ్చుకున్నానని శృతి హాసన్ అన్నారు.

లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటానని ఆమె కామెంట్లు చేశారు.

ఏ విషయాన్ని అయినా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.

నాకు నేను నచ్చిన విధంగా ఉండటానికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తానని ఆమె అన్నారు.ఏ పని చేసినా నిజాయితీగా ఉండాలని అనుకుంటానని నాన్నను సలహాలు అడగనని తాను ఏం చేస్తున్నానో ఆ విషయాలు మాత్రమే చెబుతానని శృతి వెల్లడించారు.

స్వతంత్ర భావాలతో ఏ విధంగా బ్రతకాలో నాన్న నేర్పించారని తాను ప్రస్తుతం స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటున్నానని శృతి అన్నారు.

Telugu Shruti Hassan-Movie

యాక్షన్ సినిమాలు అంటే తనకు ఎక్కువగా ఇష్టమని సంగీతకారిణిగా చేసే ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ను మాత్రం అస్సలు వదులుకోనని ఆమె అన్నారు.ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే మాత్రం వెంటనే చేసుకుంటానని ఆమె తెలిపారు.ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం ప్రేమతో ఇచ్చే ఆతిథ్యం అని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube