ఈమధ్య థియేట్రికల్ రిలీజైన కొన్ని సినిమాలు ఓటీటీలో ఆశించిన ఫలితాలు అందుకోవట్లేదు.థియేటర్ లో ఫెయిల్ అయిన సినిమాలు కొన్ని ఓటీటీలో హిట్ అవుతున్నాయి కానీ అక్కడ హిట్ అయిన సినిమాలు డిజిటల్ స్ట్రీమినింగ్ లో సోసోగానే ఆడుతున్నాయి.
అయితే రీసెంట్ గా రిలీజైన ఓ సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కాగా లేటెస్ట్ గా ఆ సినిమా ఓటీటీ రిలీజైంది.ఓటీటీ( OTT )లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇంతకీ ఆ సినిమా ఏది అంటే శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగమన( Samajavaragamana ) సినిమానే.ఈ సినిమా రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా లో సీనియర్ నరేష్ అదరగొట్టారు.
అయితే ఈ సినిమా జూన్ 29న థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అవగా లేటెస్ట్ గా సినిమా ఓటీటీలో రిలీజై అక్కడ కూడా రికార్డ్ వ్యూయర్షిప్ సాధిస్తుంది.ఈ సినిమా విషయంలో మేఅకర్స్ డిజిటల్ వెర్షన్ కూడా సక్సెస్ అవడంలో సూపర్ జోష్ లో ఉన్నారు.