పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) తెలుగు లో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.మహేష్ బాబు తో పాటు ఎంతో మంది స్టార్ హీరో ల సినిమా ల్లో ఈ అమ్మడు నటిస్తోంది.
ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందబోతున్న సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపిక అయింది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ వార్త వచ్చిన కొన్ని వారాలకే సినిమా నుంచి శ్రీ లీల ను తప్పించారు, రష్మిక మందన్నా( Rashmika Mandanna ) ను ఎంపిక చేయడం జరిగింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి.
అవి కేవలం పుకార్లు మాత్రమే అని, నిజంగా అలాంటిది ఏమీ లేదు అంటూ స్వయంగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచి క్లారిటీ వచ్చింది.
దాంతో విజయ్ సినిమా లో శ్రీ లీల కన్ఫర్మ్ అనుకున్నారు.కానీ ఇప్పుడు సినిమా లో విజయ్ కి జోడీగా సాక్షి వైద్య ను హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) మూవీ షూటింగ్ ఆలస్యం అవుతోంది.
ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన సినిమా స్క్రిప్ట్ వర్క్ పెండ్డింగ్ మరియు విజయ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
అందుకే సినిమా నుంచి శ్రీ లీల ( Sreeleela )తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే షూటింగ్ ప్రారంభించి ఉంటే శ్రీలీల నటించేది.కానీ వచ్చే ఏడాది డేట్లు కావాలి అంటే మాత్రం శ్రీ లీలకు సాధ్యం అవ్వడం లేదట.
కారణం ఇతర సినిమాల షూటింగ్స్ తో పాటు తనకు ఆ సమయంలో పరీక్షలు ఉన్నాయట.అందుకే శ్రీలీల తన పరీక్షల సమయం కోసం కెరీర్ లోనే అతి పెద్ద క్రేజీ సినిమా ను వదులుకుంది అంటూ ఆమె సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అధికారికంగా ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.