Mahesh Babu Sreeleela: మహేష్ తో సెల్ఫీ అంటే సోఫా ఎక్కాల్సిందేనా… వైరల్ అవుతున్న శ్రీ లీల ఫోటో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు.ఈయన హీరోగా ఇటీవల గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 Sreeleela Mahesh Babu Selfie Pic Viral On Social Media-TeluguStop.com

త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరిగినటువంటి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల అయింది.ఇక ఈ సినిమాకు కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా వసూళ్లు రాబడుతుంది.

ఇక ఈ సినిమా పట్ల సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిని మేకర్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు.

Telugu Guntur Karam, Mahesh Babu, Namrata, Sofa, Sreeleela, Sreeleelamahesh, Tol

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఘనంగా పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గుంటూరు కారం చిత్ర బృందానికి ఈయన తన ఇంట్లోనే పార్టీ ( Party ) అరేంజ్ చేశారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం దూరంగా ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ నాగ వంశీ( Nagavamsi ) అలాగే దిల్ రాజు( Dil Raju ) ఆయన సతీమణి హాజరయ్యారు.

వీరితోపాటు హీరోయిన్స్ శ్రీ లీల మీనాక్షి చౌదరి కూడా ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు.

Telugu Guntur Karam, Mahesh Babu, Namrata, Sofa, Sreeleela, Sreeleelamahesh, Tol

ఇలా మహేష్ బాబు ఇంట్లో గుంటూరు కారం చిత్ర బృందానికి పార్టీ ఇవ్వడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను నమ్రత (Namrata) శ్రీ లీల కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే నమ్రత షేర్ చేసినటువంటి ఫోటోలలో శ్రీ లీల (Sreeleela) మహేష్ నమ్రతతో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఫోటోని కూడా షేర్ చేశారు.శ్రీ లీల మహేష్ బాబు దంపతులతో సెల్ఫీ దిగడం కోసం ఏకంగా పక్కనే ఉన్నటువంటి సోఫా ఎక్కి మరి సెల్ఫీ దిగారు.

ఈ ఫోటోని కూడా నమ్రత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

Telugu Guntur Karam, Mahesh Babu, Namrata, Sofa, Sreeleela, Sreeleelamahesh, Tol

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా ఈ ఫోటోపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలి అంటే సోఫా ఎక్కాల్సి వచ్చిందే అయ్యో పాపం శ్రీ లీల ఏంటి మరి ఇంత పొట్టిగా ఉందా అంటూ పలువురు శ్రీ లీల హైట్ గురించి కామెంట్లు చేస్తున్నారు.మహేష్ బాబుతో సెల్ఫీ అంటే ఆ మాత్రం ఎక్కాల్సిందేలే అంటూ మరికొందరు ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా శ్రీలీల ఇలా సోఫా ఎక్కి సెల్ఫీ దిగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube