అవయవ దానంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు గాను దాదాపు లక్ష కిలోమీటర్లు తిరిగిందో భారత సంతతి జంట.వివరాల్లోకి వెళితే.
అమెరికాలో స్థిరపడిన ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త అనిల్ శ్రీవత్స 2014లో తన సోదరుడికి కిడ్నీని దానం చేసి అతని ప్రాణాలు కాపాడారు.
ఈ చర్య అనిల్‌పై ఎంతగానో ప్రభావం చూపింది.
దీంతో ఆయన అవయవదానంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.అంతే అనుకున్నదే తడవుగా భార్యతో కలిసి కారులో ‘‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అడ్వెంచర్’’ను ప్రారంభించారు.
దీనిలో భాగంగా 1,00,000 కిలోమీటర్లను చుట్టి, 43 దేశాలలోని 73,000 మందికి పైగా తన కథను పంచుకున్నారు.ఈ యాత్రలో 400 రోజులకు పైగా అనిల్ దంపతులు రోడ్డుపైనే ఉన్నారు.
ఈ సమయంలో వారి ఫుడ్డు, బెడ్డు, ఇల్లు అంతా వారి కారే.పాఠశాలలు, కళాశాలలు, రోటరీ క్లబ్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, కార్యాలయాలలో అనిల్ వందలాది చర్చలలో పాల్గొన్నారు.ఈ సమయంలో అవయవాల దానానికి సంబంధించిన భయాల గురించి వివరించడంతో పాటు వివిధ చట్టాలు, విధానపరమైన సమస్యలను సైతం శ్రీవత్స వివరించారు.అనిల్ శ్రీవత్స 1997-2006 వరకు ‘‘అనిల్- కి- ఆవాజ్ అని పిలిచే సిండికేటెడ్ రేడియో టాక్‌షోను నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు.
దీని తర్వాత తాజాగా అనిల్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అడ్వెంచర్ పేరిట న్యూయార్క్ నుంచి అర్జెంటీనాకు మరో యాత్ర చేయాలని నిర్ణయించారు.