ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామరస్ డాల్ పూజ హెగ్డే బిజీ షెడ్యూల్ తో రోజు బిజీబిజీగా గడుపుతోంది.దీంతో ఒక ఒకపక్క పెద్ద హీరోల సినిమాలు మరియు మరో పక్క సినిమా రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు అంటూ బిజీబిజీగా గడుపుతోంది ఈ అమ్మడు.
అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి అల వైకుంఠపురంలో చిత్రం విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.అంతేకాక మంచి కలెక్షన్లను కూడా సాధిస్తూ థియేటర్లలో దూసుకుపోతోంది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది.
వరుస షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతున్న అటువంటి పూజా హెగ్డే కొంతమేర అనారోగ్యానికి గురైనట్లు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది.ప్రస్తుతం పూజా హెగ్డే అనారోగ్యానికి గురవ్వడంతో కొంతకాలం జాన్ చిత్ర షూటింగ్ ని నిలిపివేసినట్లు సమాచారం.
అందువల్లనే ఈ చిత్ర విడుదల తేదీ పై కూడా ఇప్పటివరకు క్లారిటీ రావడం లేదు.అయితే దర్శకుడు రాధాకృష్ణ మాత్రం వేరే దేశాల్లో ప్లాన్ చేసినట్టు ఇతర సన్నివేశాల షూటింగ్ ముందుగా ముగించుకొని ఆ తర్వాత క హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగే టువంటి షూటింగ్ కి పూజా హెగ్డే హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే దర్శకుడు కేకే రాధాకృష్ణ ఇప్పటికే ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం పూజా హెగ్డే అనారోగ్య కారణంగా షూటింగ్ షెడ్యూల్ ఆగిపోయింది.దీంతో మరోసారి ఈ విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.