కొంతమంది గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే అలాంటి వ్యక్తులను మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అది బయట అయిన అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ లో అయిన అవ్వచ్చు.
అలాంటి వ్యక్తే హీరో అజిత్ ఆయన గురించి చెప్పాలంటే అజిత్ పుట్టింది సికింద్రాబాద్ లో అయిన తమిళ్ లో మంచి హీరోగా గుర్తింపు పొందాడు హీరోగా ప్రయత్నించే మొదటి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు.ఈ విషయం అప్పట్లో ఎస్పీ బాలు గారు ఒక ప్రోగ్రాం లో చెప్పారు బాలు గారి అబ్బాయి చరణ్ అజిత్ ఇద్దరు క్లాస్ మేట్స్ అని చెప్పాడు అజిత్ కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా యాడ్స్ షూటింగ్ ఉంటే అప్పుడు సెంటి మెంట్ గా చరణ్ షూస్ డ్రెస్ వేసుకోనివెళ్ళాడని బాలు గారు చెప్పారు అలాగే అజిత్ తర్వాత పెద్ద స్టార్ హీరో అయిపోయాడు మేము స్థాపించిన బ్యానర్ లో కూడా సినిమాలు చేశారని చెప్పాడు.
అలాగే అజిత్ కి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టమని కానీ కొన్ని యాక్సిడెంట్స్ జరగడం వల్ల బైక్ రేసింగ్ వదిలేశాడని చెప్పాడు అలాగే అజిత్ చాలా మంచి వ్యక్తి అని ఎవరితో గొడవ పెట్టుకోడు వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడని బాలు చెప్పుకొచ్చాడు.అయితే అజిత్ తెలుగు నుంచి తమిళ్ వచ్చి ఇక్కడ స్టార్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
అజిత్ వాలి, ప్రేమలేఖ ఇలాంటి హిట్స్ తో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.శివ దర్శకత్వంలో వచ్చిన వీరం, వేదం, వివేకం, విశ్వాసం లాంటి సినిమాల్లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.
అజిత్ హీరోయిన్ అయిన షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది తర్వాత అజిత్ తో కూడా సినిమాలు చేసింది మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ హీరోగా వచ్చిన సఖి సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది.
అజిత్ షాలిని లవ్ స్టోరీ చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటుంది.అజిత్, షాలిని హీరో హీరోయిన్ గా చేస్తున్న ఒక సినిమాలో అజిత్ వల్ల షాలిని చెయ్యికి దెబ్బ తగలడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు.తర్వాత వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు.
దీంతో షాలిని అంతకుముందు కమిట్ అయిన కొన్ని సినిమాలు చేసి చివరగా సఖి సినిమా చేసి ఆ తర్వాత సినిమాలు మానేసి అజిత్ నీ పెళ్లి చేసుకున్నారు.షాలిని అజిత్ గురించి మాట్లాడుతూ అజిత్ కి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే బైక్ రేసింగ్ లో పాల్గొని చాలా సార్లు కిందపడిపోయాడు ఒకసారి అయితే చాలా దెబ్బలు కూడా తగిలాయి దాంతో బైక్ రేసింగ్ చేయడం చేయడం వద్దని నేను చెప్పాను.
దాంతో అప్పటి నుంచి బైక్ రేసింగ్ లు ఏమి చేయట్లేదు.
ప్రస్తుతం అజిత్ హిందీలో హిట్ అయిన పింక్ రీమేక్ లో నటిస్తున్నారు.
వివేకం సినిమా లో అజిత్ కు జోడిగా కాజల్ నటించిన ఆ సినిమాలో అజిత్ నటన ఒక ఎత్తు అయితే కాజల్ కూడా అజిత్ భార్యగా ఒక మంచి క్యారెక్టర్ ని చేసిందనే చెప్పాలి.తమిళ్ ఇండస్ట్రీ లో రజినీకాంత్, కమలహాసన్ తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరో అజిత్ అని చెప్పాలి అజిత్ సినిమా రిలీజవుతుందంటే అక్కడ ఆల్మోస్ట్ అందరూ హీరోలు సినిమాలు వాయిదా వేసుకుంటారు.
తెలుగులో పవన్ కళ్యాణ్ హీరో గా పంజా సినిమా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ డైరెక్షన్లో అజిత్ ఆట ఆరంభం అనే సినిమా చేశారు.ఈ సినిమాలో అజిత్ ఫ్రెండ్ గా రానా పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి క్యారెక్టర్ చేశారు.
పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో కూడా క్వాలిటీ ఉండటం లేదు అలా ఉండక పోవడం వల్లే హీరో ఫ్రెండ్ అయినా రానా క్యారెక్టర్ చనిపోతుంది.దాంతో మనల్ని కాపాడే పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఇక్కడ సేఫ్టీ ఉండటం లేదు ఎందుకు జరుగుతుంది అవినీతి అని ఆరా తీసి తన ఫ్రెండ్ మరణానికి కారణమైన వాళ్ళని చంపేస్తాడు ఆట ఆరంభం సినిమాలో అజిత్ పోషించిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి గాను మంచి పేరు వచ్చింది.
ఎందుకంటే ఇప్పటికీ నిజ జీవితాల్లో కూడా పోలీసుల పట్ల గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది వల్ల ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వట్లేదు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో అజిత్ చాలా బాగా నటించి మెప్పించాడు.