Sobhita Dhulipala : సమంత పెళ్లి అంటూ ఫోటోలను షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల.. ఫొటోస్ వైరల్?

శోభిత దూళిపాళ( Shobhita Dulipala ).ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.

 Sobhita Dhulipala Shares Wedding Pics Of Samantha-TeluguStop.com

గూడచారి( Gudachari ) సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది శోభిత.తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శోభిత తన అందంతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

తెలుగు భాషలోనే కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా శోభిత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) తో ఆమె లవ్ ఎఫైర్ నడుపుతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వీరిద్దరి ఎఫైర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా చైతన్య శోభిత ల ఎఫైర్ల వార్తలే జోరుగా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి లండన్( London ) లో డిన్నర్ డేట్ కోసం ఒక రెస్టారెంట్లు కలిసిన విషయం తెలిసిందే.

దాంతో ఆ వార్తలు మరింత ఊపొందుకున్నాయి.శోభిత, నాగచైతన్య ల వ్యవహారం చాలా దూరం వెళుతోందని ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.

సమంత నుంచి విడిపోయాక చైతన్య, శోభితతో ప్రేమాయణం మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా శోభిత సమంత పెళ్లి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ చెక్కర్లు కొడుతోంది.శోభిత సమంత పెళ్లి గురించి మాట్లాడడం ఏంటా అని అనుకుంటున్నారా! శోభిత పెళ్లి కామెంట్స్ చేసింది హీరోయిన్ సమంత కాదండోయ్ ఆమె స్నేహితురాలు సమంత పెళ్లి గురించి ఈ కామెంట్ చేసింది.శోభిత తన బెస్ట్ ఫ్రెండ్ సమంత వివాహానికి హాజరైంది.

ఆమె ఓ డాక్టర్ అని తెలుస్తోంది.ఆమె పెళ్ళిలో శోభిత సందడి సందడి చేసింది.

మెహందీ, వెడ్డింగ్ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube